ఈ నవయుగంలో టెక్నాలిజీ లేనిదే ఏ పని సాధ్యపడటం లేదు. దాదాపు అన్ని పనులకు సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడుతున్నాము. టెక్నాలిజీ దాదాపు అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది, అదేవిధంగా వ్యవసాయం మీద కూడా ప్రభావం చూపుతుంది. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సాగుదారులు కూడా నెమ్మదిగా టెక్నాలిజీ వైపు సాగుతున్నారు.
వాతావరణ మార్పులు, పనిముట్ల లభ్యత, మరియు చీడపీడలు వీటిన్నిటి మీద రైతులకు సరైన సమయంలో సమాచారం లభించక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మొక్కను ఆశించే వివిధ క్రిమికీటకాలు, మరియు రోగాలు మీద పూర్తి అవగాహన కలిగి ఉండి వాటిని సకాలంలో నివారించాలి, లేకుంటే పెద్ద మొత్తంలో పంట నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన సాంకేతికత అందుబాటులోకి రావడంతో రైతన్నలు కూడా నెమ్మదిగా సాంకేతిక దిశగా అడుగులు వేస్తున్నారు, తమ పంటలకు సోకె వివిధ చీడపీడలను నివారించడానికి టెక్నాలిజీని వినియోగిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే పంట సమస్యలను గుర్తించి చికిత్స అందించడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి, మరియు రైతులకు వ్యవసాయ విజ్ఞానం అందించడానికి ప్లాంటిక్స్ ఆప్ అందుబాటులోకి వచ్చింది.
సుమారు 3 కోట్ల మంది వినియోగిస్తున్న ఈ ప్లాంటిక్స్ ఆప్ రైతులకు ఎంతో ఉపయోగకరమని ఇక్రిశాట్ శాత్రవేత్తలు చెబుతున్నారు. రైతులు సులభంగా వినియోగించుకోగలిగేలా, ఈ ఆప్ ను వారి ప్రాంతీయ భాషలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటివరకు 60 రకాల పంటలకు సంభందించిన 10 కోట్ల ఫోటోలను ఈ ఆప్ లో అప్లోడ్ చెయ్యగా, ఆప్ వాటిని విశ్లేషించి సుమారు 700 రకాల తెగుళ్లను మరియు క్రిమికీటకాలను ఈ ఆప్ గుర్తించిందని శాత్రవేత్తలు చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో ఈ ఆప్ కు ఆధరణ కూడా పెరిగింది. దీనిని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు 10 ఏళ్ల క్రిందట అభివృద్ధి చేసారు, ప్రస్తుతం ఈ ఆప్ వినియోగదారులు పెరుగుతూ వస్తున్నారు. ఈ ఆప్ ద్వారా 20 భాషల్లో రైతులకు సేవలందిస్తూ ఇప్పటివరకు 3 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. సామాన్య రైతుల్లో కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో ప్లాంటిక్స్ అప్ విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
Share your comments