ప్రపంచంలో ఆధునికత అతివేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నవీనయుగం వ్యవసాయానికి ఒక కొత్త, బంగారు శకంగా పరిగణించవచ్చు. మునపటి లాగ వ్యవసాయ అవసరాలకు కూలీలా మీదే ఆధారపడాలన్న అవసరం నేడు లేకుండా పోతుంది. దాదాపు అన్ని వ్యవసాయ అవసరాలకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు ప్రభుత్వాలు మరియు అనేక సంస్థలు చేస్తున్న నిరంతర కృషి ఫలితంగా దేశంలోని మారుమూల పల్లెల్లోని రైతులు కూడా వీటిని వినియోగించడం ప్రారంభించారు.
అధిక శ్రమతో కూడుకున్న పంటల సాగులో వరి పంట ఒకటి. వరి సాగులో ప్రతీ దశలో మానవ వనరుల అవసరం ఎక్కువుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు ప్రారంభమయ్యింది. అయితే ప్రస్తుతం రైతులను ప్రధానంగా కలిచివేస్తున్న సమస్యల్లో కూలీలా కొరత ప్రధానమైనది. భూమిని దుక్కి దున్ని, విత్తనం వేసే దగ్గర నుండి పంట కోత కోసి నూర్పిడి చేసే వరకు కూలీలా అవసరం ఎక్కువుగానే ఉంటుంది. ప్రస్తుతం కూలీలా కొరత ఎక్కువుగా ఉన్నందున, శాస్త్రజ్ఞులు రైతులకు అందుబాటులో ఉన్న యంత్రాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
కూలీలా కొరతను అధిగమించి వ్యవసాయ పనుల్లో ఎటువంటి ఆటంకం లేకుండా సమయానికి పని పూర్తి చెయ్యాలంటే సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్పి నూతన సాగు విధానాలపై ద్రుష్టి సారించవలసిన అవసరం ఉంది ప్రస్తుతం వరి సాగును సులభతరం చేసే ఎన్నో యంత్రాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించడం ద్వారా రైతుల శ్రమ తగ్గడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది. వరి సాగులో విత్తనం విత్తి, నాట్లు వేసే అవసరం లేకుండా ప్రస్తుతం ట్రాక్టర్ సహాయంతో విత్తనం విత్తుకునే డ్రమ్ సీడర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిని ఉపయోగించడం ద్వారా విత్తనాన్ని నేరుగా ఎనిమిది వరుసల్లో విత్తుకోవచ్చు. వరి విత్తిన తరువాత మొదటిగా ఎదురయ్యే సమస్య కలుపు మొక్కలు. వీటిని నివారించడానికి మనిషి సహాయం లేకుండా రోటరీవీడర్లు అందుబాటులోకి వచ్చాయి. దీనిని పొలం మొత్తం 2-3 సార్లు తిప్పినట్లైతే కలుపు భూమిలోకి అణగదొక్కబడి, కుళ్ళి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది.
ఈ మధ్యకాలంలో వరి సాగులో ప్రాముఖ్యం పొందిన విధానాల్లో శ్రీ వరిసాగు విధానం ఒకటి, ఈ విధానం రైతులకు ఒక వరం వంటిది, అయితే ఈ పద్దతికి కూలీలా అవసరం ఎక్కువుగా ఉంటుంది, కూలీలా కొరత ఉంటే ఈ పద్దతిని ఆచరించడం కష్టతరంగ ఉంటుంది. దీనిని పరిష్కరంగా శాస్త్రజ్ఞులు యాంత్రిక శ్రీవరి సాగును ప్రవేశ పెట్టారు. ఒకేసారి ఆరు నుండి ఎనిమిది వరుసల్లో నాట్లు వేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి, ఈ యంత్రాల సహాయంతో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15-20 సెంటిమీటర్ల దూరం ఉండేలా నాట్లు వేసుకోవచ్చు. వరి పంట ప్రారంభించడం ఒక ఎత్తయితే దానిని, కోత కోసి నూర్పిడి చెయ్యడం మరొక్క ఎత్తు. ఈ పనికి ఎక్కువ మంది కూలీలా అవసరం ఉండటం వలన రైతులకు వ్యయభారం పెరిగిపోతుంది. ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే మరియు అతి కొద్దీ సమయంలో పంట కోత కోసి నూర్పిడి చేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇలా అందుబాటులో ఉన్న యంత్రాలను వినియోగిస్తూ రైతులు వ్యవసాయంలో ఎన్నో గొప్ప విజయాలను సాధించవచ్చు.
Share your comments