Farm Machinery

ITOTY 2023: 2023 లో బెస్ట్ ట్రాక్టర్ ఏదో మీకు తెలుసా ?

Srikanth B
Srikanth B
ITOTY 2023: 2023 లో బెస్ట్ ట్రాక్టర్ ఏదో మీకు తెలుసా ?
ITOTY 2023: 2023 లో బెస్ట్ ట్రాక్టర్ ఏదో మీకు తెలుసా ?

2023 సంవత్సరానికి గాను ఇండియన్ ట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (ఐటీఓటీవై) విజేతల జాబితాను గత గురువారం ఢిల్లీలోని తాజ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు.

ట్రాక్టర్ల రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులు కమిటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి అవార్డుకు అర్హులను గుర్తించారు. ట్రాక్టర్ జంక్షన్ ఫౌండర్ అండ్ సీఈఓ రజత్ గుప్తా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వ్యవసాయ రంగంతో పాటు వివిధ నిత్యావసరాలకు ట్రాక్టర్ల వినియోగం పెరుగుతోంది. ట్రాక్టర్ జంక్షన్ వ్యవస్థాపకుడు రజత్ గుప్తా 2019 లో ట్రాక్టర్లను ఉపయోగించడానికి రైతులను ప్రోత్సహించడానికి అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం అవార్డుల కార్యాక్రమం ఢిల్లీలోని తాజ్ హోటల్లో జరిగింది . ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ట్రాక్టర్గా 'కుబోటా ఎంయూ 4' ఎంపిక కావడం ఇది నాలుగోసారి.

 

ఐటీఓటీవై-2023లో వివిధ అవార్డుల విభాగాల్లో విజేతల వివరాలు :

  • బెస్ట్ ట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్- 'కుబోటా ఎంయూ 4501'.
  • బెస్ట్ ట్రాక్టర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది ఇయర్ - 'సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్'.
  • ట్రాక్టర్ మాన్యుఫ్యాక్చరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు - 'మహీంద్రా ట్రాక్టర్'.
  • ఆర్చర్డ్ ట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్ - 'కుబోటా బి2441'.
  • సెకండ్ ఇయర్ విన్నర్ యొక్క ఆర్చర్డ్ ట్రాక్టర్ - 'ఫోర్స్ ఆర్చర్డ్ 2X4'.
  • అగ్రికల్చర్ కోసం ఉత్తమ ట్రాక్టర్- 'న్యూ హాలండ్ 3630 టీఎక్స్ సూపర్ ప్లస్'
  • ట్రాక్టర్ ఆఫ్ కమర్షియల్ అప్లికేషన్ - 'మహీంద్రా అర్జున్ 555డిఐ'
  • ఈ ఏడాది ప్రవేశపెట్టిన ట్రాక్టర్లలోఉత్తమమైనది 'ఐషర్ ప్రైమా జీ3 రేంజ్ ట్రాక్టర్స్'.
  • ట్రాక్టర్అవార్డు ఫర్ బెస్ట్ డిజైన్ - 'యాన్మార్ వైఎం 348ఎ 4డబ్ల్యూడీ'.
  • బెస్ట్ 4డబ్ల్యూడీ (ఫోర్ వీల్ డ్రైవ్) ట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్- 'ఫామ్ట్రాక్ 45 అల్ట్రామాక్స్'
  • సస్టెయినబుల్ ట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్ - 'స్వరాజ్ 744 ఎక్స్ టి'

  • క్లాసిక్ ట్రాక్టర్ఆఫ్ ది ఇయర్ - 'మాస్సీ ఫెర్గూసన్ 1035 డిఐ'.
  • ఆర్థిక సంక్షోభ పరిష్కారానికి వినూత్న ట్రాక్టర్- 'టీవీఎస్ క్రెడిట్'
  • అత్యంత స్థిరమైన ట్రాక్టర్ ఫైనాన్షియర్ - 'మహీంద్రా ఫైనాన్స్'
  • ఉత్తమ ట్రాక్టర్ ఫైనాన్షియర్ - 'చోళమండలం ఫైనాన్స్'.
  • ఫాస్టెస్ట్ గ్రోత్ ట్రాక్టర్ ఫైనాన్షియర్ అవార్డు - ఎస్ కే ఫైనాన్స్.
  • మోస్ట్ ట్రస్ట్డ్ ఫైనాన్షియర్ అవార్డు - 'హెచ్డీఎఫ్సీ'.

ట్రాక్టర్ అండ్ ఇంప్లిమెంటేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకుఈ అవార్డు ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

అసలు మణిపూర్ గొడవ ఏమిటి ?

ట్రాక్టర్ల రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులు కమిటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి అవార్డుకు అర్హులను గుర్తించారు. ట్రాక్టర్ జంక్షన్ ఫౌండర్ అండ్ సీఈఓ రజత్ గుప్తా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అసలు మణిపూర్ గొడవ ఏమిటి ?

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More