వ్యవసాయం మనిషి యొక్క నాగరికతకు, పురోగతికి ఎంతగానో సహాయపడింది. జంతువులను వేటాడి తినే కాలం నుండి శాశ్వత నివాసాల ఏర్పరుచుకుని బ్రతికేటందుకు వ్యవసాయం ఒక ముఖ్యకారణం. మొట్ట మొదటిసారి వ్యవసాయం చేసేటప్పడి నుండి ఇప్పటి వరకు ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వ్యసాయం లో యంత్రాలను ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు నుండి వ్యసాయం లో ఎంతో పురోగతి సాధించాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కొన్ని యంత్రాలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
భూమిని చదును చెయ్యడం:
ఒక పంట బాగా పండడానికి మంచి దిగుబడి రావడానికి మట్టి యొక్క పాత్ర అతి ముఖ్యమైనది. ప్రతీ పంటకు వేర్వేరు మట్టి రకాల అవసరం ఉంటుంది. భూమిని చదును చేయడంలో అనేక రకాల యంత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయ్. వాటిని వ్యవసాయం లో ఉపయోగించడం వాళ్ళ సమయాన్ని, మరియు శక్తిని రెండిటిని కాపాడుకోవచ్చు. అంతే కాకుండా పొలం అంత ఒకే రీతిలో చదును అయ్యేలా చెయ్యచ్చు.
విత్తు నాటడం:
ఒక్కపట్టి కాలం లో విత్తనాలను నాటేందుకు చేతితో లేదా స్థానికంగా దొరికే వస్తువులను వాడేవారు. కానీ ఈ మధ్య కాలం లో ఎన్నో రకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వరి నాటే మెషిన్లు, సీడ్ డ్రిల్ల్, వంటి సాధనాలు ఎక్కువగా వాడుతున్నారు. వీటి వాళ్ళ కూలీలా ఖర్చు తాగించడమే కాకుండా మొక్కల మధ్య కచ్చితమైన దూరాన్ని ఉంచడానికి వీలు ఉంటుంది.
నీటిపారుదల వ్యవస్థ.
మన దేశంలో వ్యవసాయానికి అవసరం అయ్యే నీటిని ఎక్కువ శాతం భూగర్భ జలాల నుండి వినియోగిస్తున్నారు. 90% కంటే ఎక్కువ భూగర్భ జలాన్ని వ్యవసాయం లో వాడుతున్నారు. కానీ విచక్షణరహితంగా నీటిని ఉపయోగించడం ద్వారా రాబోయే కాలం లో నీటి కొరత ఏర్పడే సమస్య ఉంది. దీనిని నియత్రించాడని ప్రస్తుతం మనకు అందుబాటు లో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా నీటి వృదాను తగ్గించేందుకు వీలు ఉంటుంది.
పంట రక్షణ చర్యలు:
పంట రక్షణ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది, కీటకనాశనులు, శిలింద్రనాశనులు, కానీ బాధ్యతారాహిత్యంగా వీటిని పంటల ఫై వాడటం ద్వారా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు అరికటేందుకు యంత్రాలను వాడటం శ్రేయస్కరం. రసాయనిక మందులను ఖచ్చితత్వం తో ఉపయోగించడానికి యంత్రాలు ఎంతో సాయం చేస్తాయి. డ్రోన్ లు మరియు మందులు కొట్టే ట్రాక్టర్లు వీటికి ఉదాహారణాలుగా చెప్పుకోవచ్చు.
పంట కోత విధానాలు:
యాంత్రీకరం అతి వేగంగా వృద్ధి చెందతున్న ఈ సమయం లో , పంటను హార్వెస్ట్ చెయ్యడానికి అనేకమైన ఉపకరణాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్యాడి హార్వెస్టర్లు , ఇటీవల ఉపయోగిస్తున్న ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో పని చేసే యంత్రాలు రావడం తో పంట కోతలోని నష్టాన్ని తగ్గించేందుకు దోహదపడుతున్నాయి.
గ్రీన్ ఎనర్జీ :
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న యంత్రాలు అన్ని డీసెల్ మరియు పెట్రోల్ ని ఇంధనంగా వాడుతున్నాయి. దీని వాళ్ళ పర్యావరనానికి నష్టం కలిగే అవకాశం ఉంది. కనుక రీఛార్జ్బిల్ బ్యాటరీలను, సోలార్, విండ్, తదితర మూలాల నుండి వచ్చే ఎనర్జీ వినియోగం పర్యావరణ నష్టాన్ని తగ్గిస్తుంది.
రైతులకు బ్యాంకు అఫ్ ఇండియా వారి ఫెస్టివ్ ఆఫర్లు.. వివరాలు ఇవే
పైన చర్చించిన యంత్రాలు అన్ని అందుబాటులో ఉన్నపటికీ, మన దేశంలోని రైతులు ఇప్పటికి శాస్త్రీయ పద్ధతులనే, వాడుతున్నారు . దీనికి కారణాలు ఎన్నో ఐనప్పటికీ, కొత్త ఆవిష్కరణల మీద విజ్ఞానం లేకపోవడం, ఆర్ధికంగా వెనుకబడి ఉంటడం, యంత్రాలు అందుబాటులో లేకపోవడం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రుభుత్వం దీని ఫై ద్రుష్టి సారించి , ఈ ఆవిష్కరణలను రైతులకు అందుబాటులోకి వచ్చేలా చెయ్యాలి. తద్వారా పంట ఉత్పాదకత పెరిగి దేశం ఆర్ధికంగా ముందుకు వెళ్లేలా సహాయపడుతుంది.
Share your comments