మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి, వ్యవసాయ యాంత్రీకరణ పనుల్లన్నిటిని సులభతరం చేసి రైతులకు సమయాన్ని మరియు డబ్బును ఆధా చేస్తున్నాయి. ప్రస్తుతకాలంలో వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తున్న డ్రోన్లు కూడా ఈ త్రోవలోకే వస్తాయి. ఎంతోమంది యువత డ్రోన్లను వినియోగించి ఉపాధి పొందుతున్నారు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు పొలంబాట పట్టారు. వ్యవసాయం అంటే దుక్కిదున్నడం దగ్గర నుండి పంట కోత కోసే వరకు ఎన్నో పనులుంటాయి. ప్రస్తుతం ఈ పనులకు కూలీలా కొరత ఏర్పడింది, ఒకవేళ కూలీలు దొరికి వారు ఒకరోజుకి 500-1000 రూపాయిలవరకు తీసుకుంటున్నారు పైగా వారి భోజన భక్ష్యాలు రవాణా సౌకర్యం కూడా రైతులే చూడాలి, ఈ విధంగా సన్నకారు రైతులకు పెట్టుబడి భారమౌతుంది. ఇంతటి ఖర్చును భరించలేని రైతులు యంత్రాలను వినియోగించడం ప్రారంభించారు, వ్యవసాయంలో అందుబాటులో ఉన్న యంత్రాలు, మట్టిని దున్నడం, విత్తనాలు నాటడం, పొలానికి ఎరువులు, మందులు చల్లడం, పూర్తయిన పంటను కోత కొయ్యడం ఇలా అన్ని పనులను సులభతరం చేస్తున్నాయి. వీటిని వినియోగించడం ద్వారా సమయం మరియు డబ్బు రెండు ఆధా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
ఇదివరకటి రోజుల్లో అన్ని వ్యవసాయ అవసరాలకు మనుషుల మీదే ఆధారపడవలసి వచ్చేది, అయితే ప్రస్తుతం భూమిని సిద్ధం చేసి విత్తనాలు వెయ్యడం దగ్గరనుండి, పంట కోసేవారు అన్ని పనులకు వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మన దేశంలో చిన్న మరియు సన్నకారు రైతులు సంఖ్యా చాలా ఎక్కువ, వీరు ఈ యంత్రాలను కొనుగోలు చెయ్యాలంటే చాలా కష్టం. ఈ లోటును సరిచేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ ఉపకారణాలపై సబ్సిడీలు ఇస్తుంది. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది ఔత్సహికులైన యువకులు వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసి వాటిని తక్కువ ధరకే రైతులకు అద్దెకు ఇస్తున్నారు. ఈ విధానం ఇప్పటికే ఎన్నో పట్టణాల్లో మరియు గ్రామాల్లో మొదలైంది. ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్న వారికి ప్రభుత్వం, ప్రోత్సహకాలు, తక్కువ వడ్డీకే రుణాలు మరియు అవసరమైన శిక్షణ నైపుణ్యం అందిస్తున్నారు.
విత్తనాల్ని నాటడానికి సీడ్ డ్రిల్స్ తోపాటు, ఇప్పుడు డ్రోన్లను కూడా వినియోగించడం ప్రారంభించారు, సేద్యానికి కూలీలా కొరత ఉన్నందున, ఈ డ్రోన్లనే పురుగుమందులు, ఎరువులు చల్లడానికి ఉపయోగిస్తున్నారు. డ్రోన్లు నడపడంలో శిక్షణ పొంది లైసెన్స్ కలిగిన యువకులు, ఈ డ్రోన్లతో సేద్యానికి సహాయం చెయ్యడమే కాకుండా తమ జీవనోపాధిని కూడా పొందుతున్నారు. డ్రోన్లు ఉపయోగించి మందులు చల్లడం ద్వారా, పొలం మొత్తం అతికొద్ది సమయంలోనే పిచికారీ చెయ్యొచ్చు. అంతేకాకుండా పురుగుమందుల వృధా తగ్గి రైతులకు ఖర్చు ఆధా అవవుతుంది. పంటపొలాలతో పాటు మామిడి, దానిమ్మ, జామ వంటి పండ్ల తోటల్లోనూ డ్రోన్లు వినియోగించడం ద్వారా సులభంగా పురుగుమందులు మరియు ఎరువులు పిచికారీ చెయ్యచ్చని రైతులు చెబుతున్నారు.
Share your comments