రైతులు మంచి దిగుబడి పొందాలన్నా , అధిక లాభాలు పొందాలన్నా సరే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పొలాన్ని ఒక కంట కనిపెట్టుకుని ఉండటం అత్యంత కీలకం. కొద్దిపాటి తప్పిదం కూడా తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది. అయితే కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా వ్యవహరించిన రైతులు వ్యవసాయం ద్వారా ఆశించిన దిగుబడి రాక నిరాశ చెందుతారు. మనిషి నియంత్రణలో లేని ఎన్నో కారకాలు ఈ నష్టాన్ని కలిగించవచ్చు. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా, పొలంమీద పూర్తి పట్టు సాధించి పొలాన్ని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండేందుకు వీలుగా సి-డిఏసి అనే సంస్థ SMARTFARM అనే వ్యవస్థను అభివృద్ధి చేసింది.
సెంటర్ ఫోర్ డేవెలాప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) తమ సంస్ధ స్థాపించి 37 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఐఐటీఎం ఆడిటోరియం వేదికగా, SMARTFARM వ్యవస్థను ఆవిష్కరించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చెయ్యబడిన ఈ వ్యవస్థ, భారతీయ వ్యవసాయంలో పురోగతి సాధించడానికి దోహదపడుతుంది. SMARTFARM వ్యవస్థ ప్రస్తుత సమయంలో మట్టి మరియు వాతావరణ పరిస్థితులను అంచనా వేసి మొక్క ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని, సృష్టిస్తుంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం పెరుగుతుంది.
సి-డిఏసి ఈ SMARTFARM వ్యవస్థను ఉపయోగించడం అభినందనీయం, ఈ వ్యవస్థ వ్యవసాయ దిగుబడిని పెంచడంతో పాటు, సామర్ధ్వాంతమైన వనరుల వినియోగాన్ని పెంపొందిస్తుంది అంటే వనరుల నష్టాన్ని తగ్గించడంలో ఈ వ్యవస్థ తోడ్పడుతుంది. హై పెర్ఫార్మన్స్ కంప్యూటింగ్(HPC) మరియి కుత్రిమ మేధా (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) రంగాల్లో ప్రసిద్ధిగాంచిన సి-డిఏసి సంస్ధ, రైతులు వ్యవసాయంలో ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ SMARTFARM వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
SMARTFARM_V2.O ముఖ్య లక్షణాలు:
ఈ వ్యవస్థ రైతుల పొలంలో ఏర్పరచిన కొన్ని సెన్సార్ల సహాయంతో, పంట యొక్క డేటాను సేకరించి, మట్టి మరియు వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, పంటకు తగ్గట్టు ముందస్తుగా చేపట్టవలసిన చర్యలను నిర్ధేశిస్తుంది. సుస్థిర వ్యవసాయ లక్షయంలో భాగంగా, సస్యరక్షణ చర్యలను, పర్యావరణహితమైన వ్యవసాయని ముందుకు తీసుకువెళ్లడంలో సహాయం చేస్తుంది.
పంటా ఎదుగుదలను ప్రభావితం చేసే, ఉష్ణోగ్రత, వాతావరణ తేమ, కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని అలాగే మట్టిలోని తేమ మరియు పిహెచ్ శాతాన్ని ఎల్లపుడు పర్యావేక్షిస్తు, ఏవైనా మార్పులు చేయవలసి వస్తే దానికి తగ్గట్టు సూచనలను రైతులకు ఎస్ఎంఎస్ రూపంలో అందిస్తుంది. అంతేకాకుండా రైతులు సులభంగా అర్ధం చేసుకు విధంగా ఈ వ్యవస్థ రూపొందించబడింది. కొన్ని ప్రత్యేక పంట దశల్లో పంటకు నీటిని అందించడం ఎంతో అవసరం, ఈ వ్యవస్థ నీటి లభ్యతను బట్టి అలాగే మట్టిలో తేమ శాతాన్ని బట్టి మొక్కలకు నీటిని అందించే విధంగా తయారుచెయ్యబడింది, ఒక్కసారి నీటిని అందించడానికి షెడ్యూల్, తెలియజేస్తే SMARTFARM సిస్టం సమయానుగుణంగా నీటిని అందిస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించే రైతులు, మొక్కకు ఎంత మొత్తంలో పోషకాలు అవసరమో ఈ వ్యవస్థ ద్వారా తెలుసుకొని, ఫెర్టిగేషన్ పద్దతిలో పోషకాలను అందించే అవకాశం ఉంటుంది తద్వారా, అధిక పోషకాలు వినియోగాన్ని తగ్గయించవచ్చు మరియు మట్టి కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.
SMARTFARM వ్యవస్థ పనితీరు కుత్రిమమేధా, ఐఓటీ, పరిజ్ఞానం కలయిక ద్వారా అభివృద్ధి చెయ్యబడింది. ప్రకృతి మనకు అందించిన వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ వాటిని తర్వాత తరాలకు చేరేలా చెయ్యడం మన బాధ్యత, కానీ అవగాహన లేక మన వాటిని అవసరానికి మించి ఉపయోగిస్తూ, వాటిని వృథా చేస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయం ఈ వృధా చాల ఎక్కువుగా ఉంద్, SMARTFARM వ్యవస్థను మీ వ్యవసాయాలో వినియోగించడం ద్వారా ప్రకృతి వనరులను అవసరంమేరకు వినియోగిస్తూ వాటి వృధానీ తగ్గించవచ్చు.
Share your comments