రాబోయే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి మరియు ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి యువత ప్రయోజనాలకై కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ వారధి మొబైల్ యాప్‌ను ప్రారంభించారు.
కరీంనగర్ ఐటీ హబ్‌లో మొబైల్ యాప్ ని ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 అభర్ధులు ఈ యాప్ ని వినియోగించుకోవాలని సూచించారు.
కరీంనగర్‌కు చెందిన టెక్ స్టార్టప్ టీమ్ రూపొందించిన మొబైల్ యాప్ ప్రత్యేకత
ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సబ్జెక్ట్‌ల వారీగా స్టడీ మెటీరియల్‌లను పొందవచ్చని తెలిపారు. వివిధ నియామకాల్లో పోటీ పరీక్షల కోసం తక్షణమే వారి ప్రిపరేషన్ స్థాయిని పెంచుకోవడానికి మాక్ పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ యాప్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత వినియోగించుకోవాలని కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సూచించారు.తాజా అప్‌డేట్‌లు, ఎన్‌సీఈఆర్‌టీ, తెలంగాణ ప్రభుత్వ పుస్తకాలతో సహా సమగ్ర స్టడీ మెటీరియల్‌లు మరియు కోచింగ్ సెంటర్‌ల వంటి ఇతర సంబంధిత సమాచారాన్ని కలిగి ఉన్నందున యూజర్ ఫ్రెండ్లీ యాప్ మొత్తం రాష్ట్రంలోని ఉద్యోగ ఔత్సాహికులకు ఒక వరం అని ఆయన తెలిపారు.
ఈ యాప్ ని వినియోంచడానికి అభ్యర్థులు మొబైల్ నెంబర్ నమోదు చేసి తరువాత వచ్చే ఓటీపీ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
గ్రూప్ 1 పోస్టుకి భారీగా దరఖాస్తులు
TSPSC గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, అయితే గ్రూప్ 1 పోస్టులకి బేర్ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు TSPSC వెల్లడించింది.ఇప్పటి వరకు 1,33,886 దరఖాస్తులు అందినట్లు TSPSC వెల్లడించింది.
మరిన్ని చదవండి.
Share your comments