దేశంలోనే అత్యుత్తమమైన ఉద్యోగ ప్రవేశ పరీక్షా UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షా .. ప్రతియేటా నిర్వహించే ఈ పరీక్ష కోసం లక్షలలో నిరుద్యోగ అభ్యర్థులు ధరఖాస్తు చేసుకుంటారు. దేశంలోనే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కోసం నిర్వహించే ఈపరీక్ష రేడు దశలలో ఉంటుంది ఒకటి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అయితే 2022 సంవత్సరానికి సంబందించిన ఏడాది యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ రాత పరీక్షలు సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు మొత్తం పది రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఫలితాలను UPSC ఈ మంగళవారం రోజు విడుదల చేసింది .
మెయిన్స్ రాత పరీక్షకు హాజరైనవారు అధికారిక వెబ్‌సైట్upsc.gov.in లేదా upsconline.nic.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ . మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకి హాజరవవచ్చు. మెయిన్స్, ఇంటర్వ్యూలలో మెరిట్ సాధించిన వారు IAS ,IPS ,IRS ,IFS వంటి సర్వీస్ లకు ఎంపికవుతారు .
UPSC Civil Services Mains Result 2022 ఇలా చెక్ చేసుకోండి .
ముందుగా కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను upsc.gov.in ఓపెన్ చెయ్యాలి.
హోమ్ పేజ్‌లో కనిపించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రిజల్ట్ 2022 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
అనంతరం రోల్ నంబర్, పేరు నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
ఇక్కడ ఫలితాలు కనిపిస్తాయి .
Share your comments