డిసెంబర్ నెలలో తెలంగాణ నిరుద్యోగులు మరిన్ని శుభవార్తలు వినే అవకాశం వుంది . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా గ్రూప్ 1 , గ్రూప్ 4 నోటిఫికేషన్ లను విడుదలచేసింది . అదే క్రమంలో డిసెంబర్ మూడవ వారం లో గురుకులాల్లో 12000 ఖాళీలను భర్తీచేయనుంది . 9,096 పోస్టుల భర్తీకి గతంలోనే ఆమోదం లభించింది దీనికి తోడు మరో 3000 ఖాళీలకు భర్తీకి కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు దీనితో మొత్తం 12000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం అవుతుంది . ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) చర్యలు చేపట్టింది. ఈ నెల మూడో వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 17వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాల ప్రక్రియను వేగంగా కొనసాగిస్తోంది. గ్రూప్-1, గ్రూప్-4 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇప్పుడు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వరుస నోటిఫికేషన్లతో తెలంగాణ నిరుద్యోగులతో ఉత్సాహం కనిపిస్తుంది .
TSPSC Group4: 9168 గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల .. మార్చి /ఏప్రిల్ లో పరీక్ష !
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించింది. మరోవైపు 119 బీసీ గురుకుల పాఠశాలలు, మైనార్టీ సొసైటీ పరిధిలో 97 పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ప్రారంభించిన, పాఠశాలలో లో పోస్థుల భారతికి కూడా ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది .గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలనీ ప్రభుత్వం యోచిస్తోంది . మరియు పెరిగిన ST రిజర్వేషన్ కు సంబందించిన రోస్టర్ విధానంలో కూడా మార్పులను చేస్తుంది .
Share your comments