నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తన్నా తరుణం వచ్చేస్తుంది అందుతున్న సమాచారం మేరకు రేపు సోమవారం నాడు అధికారిక గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
TELANGANA :గ్రూప్-1 పోస్టుల నోటిఫికేషన్ కోసం సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది.తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్-1కి సంబంధించి ఇదే తొలి నోటిఫికేషన్, 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-I కేడర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 19 వివిధ విభాగాల్లో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది.
121 మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు( Mandal Parishad Development Officer)
91 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(Deputy Superintendents of Police)
48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు(Commercial Tax Officers), 42 డిప్యూటీ కలెక్టర్లు(Deputy Collectors )
40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు(Assistant Audit Officers)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్-1కి ఇదే తొలి నోటిఫికేషన్. చివరి నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2011 వ సంవత్సరంలో విడుదలైంది.
ఎంపిక విధానంలో మార్పులు...
అయితే నియామకాలను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-I మరియు గ్రూప్-II పోస్టులతో సహా అన్ని కేటగిరీల క్రింద TSPSC పరీక్షల కోసం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. ఇంతకుముందు గ్రూప్-1 పోస్టుల నియామకాల్లో ప్రిలిమినరీ , మెయిన్స్ పరీక్ష మరియు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)తో కూడిన మూడు-దశల ద్వారా ఎంపిక ఉండేది.
మరిన్ని చదవండి.
Share your comments