Education

PM-SHRI Yojana: పీఎం శ్రీ యోజన స్కీమ్ క్రింద 9,000 పాఠశాలలు ఎంపిక !

Srikanth B
Srikanth B

దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్య విధానం లో మార్పులు తీసురావాలని దానికి సంబంధించి PM -SHRI Yojana క్రింద దేశ వ్యాప్తం గ 14,000 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలని టీచర్ డే సందర్భం గ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు స్వీకరించిన ఉపాధ్యాయులతో మాట్లాడిన అనంతరం ప్రధాని మోడీ తన ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటననను చేసారు .

ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా- పీఎం శ్రీ యోజన కింద.. దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేసి, అప్‌గ్రేడ్ చేస్తామని, ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. తాజా స్కీమ్‌తో పాఠశాలలు న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ విధానం స్ఫూర్తితో మోడల్ పాఠశాలలుగా మారుతాయని మోదీ అన్నారు.

ఇవి నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ స్ఫూర్తిని నింపే మోడల్ పాఠశాలలుగా మారుతాయి. పీఎం శ్రీ పాఠశాలలు విద్యను అందించడానికి ఆధునిక, పరివర్తన, సంపూర్ణ విధానాన్ని కలిగి ఉంటాయి. డిస్కవరీ- ఓరియంటెడ్‌, లెర్నింగ్‌-సెంట్రిక్‌ బోధనా విధానంపై దృష్టి పెడతాయి. అత్యాధునిక సాంకేతికత, స్మార్ట్ క్లాసులు, క్రీడలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.' అని పేర్కొన్నారు.

తాజాగా ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9,000 పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. త్వరలోనే ఆయా పాఠశాలల పేర్లను వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు .. 13 న ఫలితాలు !

ఈ పథకం కింద ఎంపిక కావాలంటే స్కూల్ యాజమాన్యం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల ఫార్మాట్‌లో స్కూల్స్‌ను ఎంపిక చేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా 2.5లక్షల దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో కేంద్రీయ విద్యా సంస్థలు, నవోదయ పాఠశాలలు కూడా ఉన్నాయన్నారు. వీటిలో నుంచి 9,000 పాఠశాలలను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.

PM-SHRI Yojana - అధునాత సౌకర్యాల కల్పన

ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. 'ఈ పాఠశాలల లక్ష్యం మెరుగైన బోధన, అభ్యాసం, అన్ని విధాల అభివృద్ధి మాత్రమే కాకుండా, 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలతో కూడిన సంపూర్ణ, సుసంపన్నమైన వ్యక్తులను సృష్టించడం.' అని తెలిపింది. ఈ పాఠశాలల్లో అవలంబించే బోధనా విధానం మరింత అనుభవపూర్వకంగా, సంపూర్ణంగా, సమగ్రంగా, ఆట/బొమ్మల ఆధారంగా, విచారణ-ఆధారితంగా, ఆవిష్కరణ-ఆధారితంగా ఉంటుందని పేర్కొంది.

ఈ పాఠశాలల్లో ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, స్పోర్ట్స్ పరికరాలు, ఆర్ట్ రూమ్ మొదలైన ఆధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ పాఠశాలలు నీటి సంరక్షణ, వ్యర్థాల రీసైక్లింగ్, ఇంధన-సమర్థవంతమైన హరిత పాఠశాలలుగా కూడా అభివృద్ధి చెందుతాయని పీఎంవో తెలిపింది.

PM-SHRI Yojana-లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇటీవలి సంవత్సరాలలో విద్యా రంగాన్ని మార్చిందని పీఎం మోదీ అన్నారు. ఎడ్యుకేషన్‌ పాలసీ ద్వారా పీఎం శ్రీ పాఠశాలలు భారతదేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయని కచ్చితంగా నమ్ముతున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలు నిర్వహిస్తున్న పాఠశాలల నుంచి ఎంపిక చేసి, ప్రస్తుత పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకం అమలవుతుందన్నారు. పీఎం శ్రీ పాఠశాలలు న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ పాటిస్తూ ఆదర్శంగా ఉండటమే కాకుండా, సమీపంలోని ఇతర పాఠశాలలకు మార్గదర్శకత్వం కూడా అందిస్తాయని వివరించారు.

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు .. 13 న ఫలితాలు !

Share your comments

Subscribe Magazine

More on Education

More