పదో తరగతి పూర్తిచేసి ఉదోగ్య అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.... పదో తరగతి విద్యార్హతతో తపాలా శాఖల్లో భారీ కొలువులకు నోటిఫికేషన్ విడుదల కానున్నది. పూర్తి వివరాలు మీ కోసం.....
ప్రతి ఏటా ఇండియన్ పోస్ట్ ఆఫీస్, భారత దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్ట్ సర్కిల్స్లో 'గ్రామీణ డాక్ సేవక్' (జీడిఎస్) పోస్టుల భర్తీ చేస్తుంది. 2024-25 సంవత్సరంలో ఈ పోస్టుల నియామకానికి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సంసిద్ధమవుతుంది, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చెయ్యనుంది. మరొక్క ఆసక్తి కరమైన విష్యం ఏమిటంటే, ఈ జాబ్స్ భర్తీ చెయ్యడానికి రాత పరీక్ష ఉండదు, కేవలం 10 వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుల నియామకం జరుగుతుంది.
గత సంవత్సరం జనవరిలో 40 వేళా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు జరిపారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని అంచనా. రాత పరీక్షా లేకుండానే, అభ్యర్థుల పదోవ తరగతి మార్కులను బట్టి ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
జీడిఎస్ పోస్టులకు ఎంపికైనవారికి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల్లో నియమిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారికి రోజుకి 4 గంటలు మాత్రమే పనివేళలు ఉంటాయి. ప్రత్యేక ఇన్సెంటివ్స్ పొందేందుకు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకి సంభందించిన పోస్ట్ ఆఫీస్ సేవల్లో విధులు నిర్వహించవలసి ఉంటుంది.
పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే ఈ పోస్టులకు నోటిఫికేషన్ తొందర్లోనే వెలువడనుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు, 18-40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. బీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్సీలకు ఐదేళ్లు, మరియు వికలాంగులకు పది సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టులను బట్టి ఎంపికైన వారికి ప్రారంభవేతనం 10 వేలు నుండి 12 వేలు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటును విసిట్ చెయ్యండి.
Share your comments