Education

AP High Court Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు లో ఉద్యోగాలు ... దరఖాస్తు చేసుకోండి ఇలా !

Srikanth B
Srikanth B

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న స్టేట్‌ హైకోర్టు లో కోర్టు మాస్టర్, పర్సనల్‌ సెక్రెటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి !

ఖాళీల వివరాలు :

పోస్టుల వివరాలు: కోర్టు మాస్టర్, పర్సనల్‌ సెక్రెటరీ పోస్టులు

మొత్తం ఖాళీలు: 10

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టులను బట్టి ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌/లా స్పెషలైజేషన్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్పీడ్‌ టైపింగ్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌), ఏపీ హైకోర్ట్‌, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా- 522237.

ఉత్తరప్రదేశ్ లో వింత ఘటన .. తన భార్యను కరిచినా పామును ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త

దరఖాస్తు రుసుము:

EWS అభ్యర్ధులకు: రూ.1000
SC /ST /వికలాంగ అభ్యర్ధులకు: రూ.500
దరఖాస్తుకు చివరితేదీ: జులై 25, 2022

తెలంగాణ SSC ఫలితాలు రేపే విడుదల !

Share your comments

Subscribe Magazine

More on Education

More