Telangana Job Notifications: తెలంగాణ మంత్రి హరీశ్ రావు నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించారు . వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అయన తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితిని 3 ఏళ్ల పెంచినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని మంత్రి హరీశ్ రావు సోమవారం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వారంలోపు ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అయన వెల్లడించారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు . పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించామని, మరే రాష్ట్రంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల్లోని ఖాళీలను కూడా భర్తీ చేయబోతున్నామని... మొత్తంగా ఈ ఏడాది 91 వేల ఉద్యోగాల భర్తీ TSPSC ద్వారా చేపట్టనున్నట్లు అయన తెలిపారు .
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 1,32,000 ఉద్యోగాల భర్తీ జరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. త్వరలో 91 వేల ఉద్యోగాల భర్తీ తో కలిపి మొత్తం 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ అవుతాయని,వచ్చే ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని అన్నారు .
ఇది కూడా చదవండి.
Share your comments