Education

IIIT-Naya Raipur Summer Internship:సమ్మర్ ఇంటర్న్‌షిప్ కోసం IIIT-Naya Raipur దరఖాస్తులను ఆహ్వానిస్తోంది

S Vinay
S Vinay

IIIT-Naya Raipur సమ్మర్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది,ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని స్టైపెండ్ పొందండి.

IIIT-Naya Raipur Summer Internship:
IIIT-NR ఫ్యాకల్టీ సభ్యుల పర్యవేక్షణలో IIIT-NRలో 6 నుండి 8 వారాల ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్‌రీచ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (Outreach Internship Programme) అనేది IIIT నయా రాయ్‌పూర్ యొక్క పరిశోధనా కార్యక్రమాలలో ఒకటి, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల నుండి విద్యార్థులను క్యాంపస్‌కు తీసుకుంటుంది.

OIP ప్రోగ్రామ్, అభ్యర్థులకు ముందు నుండే కొనసాగుతున్న పరిశోధన ప్రాజెక్ట్‌లలో పాల్గొనడానికి అనుమతిస్తుంది మరియు సమయంలో విద్యార్థులు వారి సంబంధిత ఇంటర్న్‌షిప్ ను ఏకకాలంలో పూర్తి చేయవచ్చు.

ఇంటర్న్‌షిప్ నిర్వహించే విధానం:
ఫ్యాకల్టీ సభ్యులతో కూడిన కమిటీ అభ్యర్థులను పరస్పర చర్చల ద్వారా పరీక్షించి, ఖరారు చేస్తుంది CGPA/ఇంటర్వ్యూ/ప్రాజెక్ట్ ప్రతిపాదన, సాంకేతిక విజయాలు మొదలైన వాటి ఆధారంగా కమిటీ ఇంటర్న్‌లను ఎంపిక చేస్తుంది.

IIIT-Naya Raipur Summer Internship:విద్యార్హత
బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్న ఇతర ప్రసిద్ధ సంస్థల విద్యార్థులు ఏదైనా ఫ్యాకల్టీ మెంబర్ కింద IIIT-NR లో ఇంటర్న్‌షిప్ చేయడానికి అనుమతించబడతారు.

అభ్యర్థి తప్పనిసరిగా CSE, IT, ECE, ETE, EE, EEE, EI, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సులు చదువుతూ ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 6వ సెమిస్టర్ (3వ సంవత్సరం) పూర్తి చేసి ఉండాలి.

IIIT-Naya Raipur Summer Internship: ఇంటర్న్షిప్ వ్యవధి
స్టైఫండ్‌ను పొందేందుకు ఇంటర్న్ 6 నుండి 8 వారాల పాటు ఆఫ్‌లైన్ మోడ్‌లో పని చేయాల్సి ఉంటుంది.

IIIT-Naya Raipur Summer Internship:దరఖాస్తు కి చివరి తేదీ
ఆసక్తిగల అభ్యర్థులు 2022 ఏప్రిల్ 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం కొరకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళండి. Outreach Internship Program 2022 (iiitnr.edu.in)

మరిన్ని చదవండి.

IB ACIO Recruitment 2022:ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఖాళీలు నెలజీతం రూ.44,900 నుండి 1,42,400 వరకు

Share your comments

Subscribe Magazine

More on Education

More