బ్యాంకుల్లో కొత్త ఖాతా తెరవాలన్న, పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చెయ్యాలన్న పాన్ కార్డు తప్పనిసరి. అధిక మొత్తంలో పెట్టుబడులకు, ఐటీ రిటర్న్స్ ఫైల్ చెయ్యాలన్నా మరియు వివిధ ఆర్ధిక లావాదేవీలకైనా పాన్ కార్డు ఎంతో కీలకం. అయితే పాన్ కార్డు పొందాలంటే అప్లై చేసిన తర్వాత మాత్రమే పాన్ కార్డు లభిస్తుంది
అత్యవసర పరిస్థితుల్లో పాన్ కార్డు అవసరం ఉన్నవారు సులువైన పద్దతి ద్వారా తక్షణమే ఇ- పాన్ కార్డు పొందే అవకాశం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కల్పించింది. ఈ ఎలక్ట్రానిక్ పాన్ కార్డు పొందేందుకు ఎటువంటి రుసుము చెల్లించావలిసిన అవసరం లేదు. ఇంటి వద్దే సులభంగా పొందవచ్చు.
ఇ-పాన్ కార్డు పొందేందుకు ముందుగా, ఇన్కమ్ టాక్స్ ఆఫ్ ఇండియా వెబ్సైటు లోకి వెళ్లి, స్క్రీన్ మీద ఎడమ వైపు కనిపించే క్విక్ లింక్స్ సెక్షన్ లో కనిపించే ఇన్స్టెంట్ పాన్(Instant Pan) అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యగానే గెట్ న్యూ ఇ-పాన్(Get New e-Pan) అన్న ఆప్షన్ ఎంచుకోండి.
ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కి అనుసంధానమై ఉన్న ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, I Conform That అన్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన ఆధార్ కార్డు నెంబర్ కు లింకై ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది,ఆ ఓటీపీ ఎంటర్ చెయ్యగానే మీ పేరు మరియు ఇతర వ్యక్తిగత వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ వివరాలను సరిచేసుకొని వివరాలు అన్ని సరిగ్గా ఉంటె I Accept that అన్న చెక్ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చెయ్యగానే మీ ఇ- పాన్ కార్డు కోసం దరఖాస్తు పూర్తయినట్లే. తర్వాత మీ అప్లికేషన్ కు సంబంధించిన అక్నౌలెడ్జిమెంట్ నెంబర్ కనిపిస్తుంది దానిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి.
ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కి కంఫోర్మషన్ మెసేజ్ అందిన తర్వాత పైన చెప్పిన విధంగా ఇన్కమ్ టాక్స్ వెబ్సైటు కి వెళ్లి గెట్ న్యూ ఇ-పాన్ మీద క్లిక్ చేసి ఈ సరి Download ఇ-పాన్ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత మీ మొబైల్ కి వచ్చే ఓటీపీ ఎంటర్ చెయ్యగానే అక్కడ download ఇ-పాన్ అన్న ఆప్షన్ ద్వారా సులభంగా మీ ఇంటి వద్ద నుండే పాన్ కార్డు పొందవచ్చు. అత్యవసరంగా పాన్ కార్డు అవసరం ఉండనుకునేవాళ్ళు ఈ పద్ధతి ద్వారా సులభంగా పాన్ కార్డు పొందవచ్చు. అంతేకాకుండా ఈ విధంగా పాన్ కార్డు ఉచితంగా పొందవచ్చు.
Share your comments