ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో 9,212 పోస్టులను విడుదలచేస్తూ CRPF నియామక సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది , ఆశక్తి కల్గిన అభ్యర్థులు ఏప్రిల్ 24 లోపు అధికారిక వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది .
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :మార్చి 27
ఆన్ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ :ఏప్రిల్ 24
అధికారిక వెబ్సైటు :www.crpf.gov.in
పరీక్షా తేదీ :2023 జూలై 1 నుండి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష
అడ్మిట్ కార్డులు : అడ్మిట్ కార్డులను జూన్ 20న విడుదల చేస్తారు.
పరీక్షా విధానం :
రాత పరీక్షతో పాటు, నియామక ప్రక్రియలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి.
నిరుద్యోగులకు శుభవార్త..హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా..
జీతం :
మొత్తం 9,212 పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు . ఇందులో పురుషులకు 9,105, మహిళా అభ్యర్థులకు 107 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు పే లెవల్ 3 ప్రకారం.. రూ.21,700 - 69,100 పొందుతారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ:
- ముందుగా CRPF అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- తర్వాత రిక్రూట్మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
- CRPF ఫారమ్‌ను పూరించి.. సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి.
- వివరాలను నింపి.. ఫైనల్ సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
- అప్లికేషన్ సమర్పించిన అభ్యర్థులు భవిష్యత్తు అవసరాలకోసం అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసుకోండి .
-
నిరుద్యోగులకు శుభవార్త..హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా..
Share your comments