బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (border security force) 2022 సంవత్సరానికై వివిధ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
BSF Recruitment 2022: ఉద్యోగ ఖాళీ వివరాలు
ఇన్స్పెక్టర్ (ఆర్కిటెక్ట్) (Inspector Architect) - 01 పోస్ట్
సబ్ ఇన్స్పెక్టర్ (వర్క్స్) (Sub Inspector (Works) - 57 పోస్టులు
జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్) (Junior Engineer /Sub Inspector (Electrical) - 32 పోస్టులు
BSF Recruitment 2022:వయో పరిమితి
ఆన్లైన్ దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థులు తప్పనిసరిగా 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.
BSF Recruitment 2022:ఎంపిక విధానం
అభ్యర్థులు ఎంపికకై రెండు దశల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటి దశలో వ్రాత పరీక్ష ఉంటుంది, అయితే మొదటి దశ పరీక్షను క్లియర్ చేసిన అభ్యర్థులు డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లతో కూడిన రెండవ దశని పూర్తి చేయాలి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వారి ఫిట్నెస్ను అంచనా వేయడానికి మెడికల్ బోర్డ్ వైద్య పరీక్షను నిర్వహిస్తారు.
BSF Recruitment 2022:దరఖాస్తు రుసుము
అభర్ధులు ఆన్ లైన్ ద్వారా రూ. 200 చెల్లించావలిసి ఉంటుంది.
మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, BSF సేవలందిస్తున్న సిబ్బంది మరియు మాజీ సైనికులు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
అభర్ధులు మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
మరిన్ని చదవండి.
Share your comments