తెలంగాణ లో గత నెల నుంచి నిత్యం జాబ్ నోటిఫికేషన్ ప్రకటన లు వెలువడుతూనే ఉన్నాయి .. గత వారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3996 పోస్టు ల భర్తీకి ఆమోదం లభించిన విషయం తెలిసిందే , అదే క్రమంలో కొత్తగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో 7 వేలకు పైగా కొత్త ఖాళీలకు (Jobs) ఆమోదం లభించింది. వివిధ కోర్టుల్లో 4 వేలకు పైగా ఖాళీల భర్తీకి సైతం సర్కార్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తాజాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మరో 879 ఖాళీలు నూతనంగా మంజూరయ్యాయి. ఇరిగేషన్ శాఖ పంపించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది.
ఇన్ స్పెక్టర్ పోస్టులు 532, ఎలక్ట్రిషియన్ 109, ఫిట్టర్ 50, ఆపరేటర్స్ 167, ల్యాబ్ అటెండెం ట్ 10, వైర్లెస్ ఆపరేటర్ పోస్టులు 11 జిల్లాల వారీగా కేటాయించారు. అన్ని కేటగిరీల్లో కలిపి ఆదిలాబాద్ జిల్లాకు 10, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు 37, జగిత్యాలకు 36, జనగా మకు 24, జయశంకర్ భూపాలపల్లికి 26, జోగులాంబ గద్వాలకు 21, కామారెడ్డికి 24, కరీంనగర్కు 32, ఖమ్మంకు 39, కుమ్రంభీం
ఆసిఫాబాద్కు 22, మహబూబాబాదు 23, మహబూబ్ నగర్కు 21, మంచిర్యాలకు 24, మెదక్ కు 17, ములుగుకు 12, నాగర్ కర్నూ ల్కు 44, నల్గొండకు 64, నారాయణపేటకు 23. నిర్మలకు 20, నిజామాబాద్కు 40, పెద్ద పల్లికి 50, రాజన్న సిరిసిల్లకు 23, రంగారెడ్డికి 27, సంగారెడ్డికి 25, సిద్దిపేటకు 49, సూర్యా పేటకు 27, వికారాబాద్కు 26, వనపర్తికి 16, వరంగల్ అర్బన్కు 13. వరంగల్ రూర ల్కు 30, యాదాద్రి భువనగిరికి 33, మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాకు ఒక పోస్టు మంజూరుఅయ్యాయి .
TSPSC :1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ .. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ !
అదేవిధముగా డిసెంబర్ నెలలో తెలంగాణ నిరుద్యోగులు మరిన్ని శుభవార్తలు వినే అవకాశం వుంది . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా గ్రూప్ 1 , గ్రూప్ 4 నోటిఫికేషన్ లను విడుదలచేసింది . అదే క్రమంలో డిసెంబర్ మూడవ వారం లో గురుకులాల్లో 12000 ఖాళీలను భర్తీచేయనుంది . 9,096 పోస్టుల భర్తీకి గతంలోనే ఆమోదం లభించింది దీనికి తోడు మరో 3000 ఖాళీలకు భర్తీకి కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు దీనితో మొత్తం 12000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం అవుతుంది . ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. ఈ నెల మూడో వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
Share your comments