బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ (BIEAP) ఈరోజు అనగా ఏప్రిల్ 26వ తేదిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ( క్లాస్ 11) మరియు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం (క్లాస్ 12) ఫైనల్ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది. విద్యార్థులు 2023 ఎపి ఇంటర్ ఫలితాలను అధికారిత వెబ్సైటు అయిన bie.ap.gov.in లో లేదా examresults.ap.nic.in వెబ్సైటు లో చుస్కోవచ్చు .
రిజల్ట్స్ డేట్ : 26 ఏప్రిల్,2023
time : 5 pm
ప్రెస్ రిలీజ్ ప్రకారం , ఆంధ్ర ప్రదేశ్ యొక్క విద్యశాఖ మంత్రి అయిన బొచ్చ సత్యనారాయణ, ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీని అనంతరం విద్యార్థులు ఫలితాలను ఆన్లైన్ వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు . పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోడానికి విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి చూసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రo లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు , మార్చ్ 15 నుండి ఏప్రిల్ 3 వరకు కొనసాగగా , రెండవ సంవత్సరం పరీక్షలు మా ర్చి 16 నుండి ఏప్రిల్ 4, 2023 వరకు నిర్వహించబడ్డాయి. గత సంవత్సరం 2022 లో ఎపి లో ఇంటర్మీడియట్ ఉతీర్ణత శాతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు - 54 % అలాగే సెకండ్ ఇయర్ కు 61 % గా నమోదయ్యింది .
Share your comments