AIIMS Jobs 2022: ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. అర్హులు దరఖాస్తు చేసుకోండి ఇలా ?
AIIMS బిలాస్పూర్ హిమాచల్ ప్రదేశ్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 89 ఫ్యాకల్టీ (గ్రూప్ ఎ) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ aiimsbilaspur.edu.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే ఈ ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. https://www.aiimsbilaspur.edu.in/ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 30 మరియు అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు చివరి తేదీగా డిసెంబర్ 7
నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద ప్రొఫెసర్, అదనపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి 89 పోస్టులను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. SC/ST అభ్యర్థులు రూ. 1000 ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2వేలు చెల్లించాలి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు సమర్పించడం ఎలా ?
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.aiimsbilaspur.edu.in/కి వెళ్లండి. దీని తర్వాత, అభ్యర్థి రిక్రూట్మెంట్ సంబంధిత నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి, దరఖాస్తు చేయడానికి Google ఫారమ్‌ను పూరించి దరఖాస్తులను సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
తర్వాత ఈ దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి. అభ్యర్థులు ప్రింట్ తీసుకున్న దరఖాస్తు ఫారమ్ ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, (రిక్రూట్మెంట్ సెల్) అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 3వ అంతస్తు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోతిపురా, బిలాస్పూర్ హిమాచల్ ప్రదేశ్-174037కు పంపాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు
Share your comments