Education

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్..

Gokavarapu siva
Gokavarapu siva

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా పేపర్ లీకేజ్ లు జరుగున్నాయి. ఇటీవలి తెలంగాణ రాష్టంలో TSPSC పరీక్షా పేపర్ల లీకేజితో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం TSPSC గ్రూప్ 1 పరీక్షలతో పాటు మరో నాలుగు పరీక్షలను రద్దు చేసింది. నేటినుండి తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ కలకలం రేపుతోంది. దీనితో రాష్ట్రానికి ఈ లీకేజ్ బెడద ఇంకా వీడలేదు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. కానీ పరీక్ష మొదలైన కొద్దీ సమయంలోనే పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కేవలం పరీక్ష మొదలైన ఏడూ నిమిషాలకే పేపర్ లీక్ అయ్యింది. వికారాబాద్ జిల్లాకు చెందిన తాండూరులో ఈ ఘటన జరిగింది.

తాండూరుకు చెందిన ఒక పరీక్ష కేంద్రం నుండి ఈ పేపర్ లీక్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపద్యంలో విద్యాశాఖ అధికారులు మరియు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేపర్ ఎలా లీక్ అయ్యింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ఈ విషయంపై వికారాబాద్ డీఈవో వివరణ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాల నుండి ఎటువంటి పేపర్ లీక్ అవ్వలేదని ఆయన చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..

పత్తి రైతులకు హెచ్చరిక: పత్తి నిల్వతో బాధ పడుతున్న రైతులు..

ఈ టెన్త్ పేపర్ లీక్ పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి లీకేజ్ పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి ప్రశ్నాపత్నం లీకేజ్‌పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి..

పత్తి రైతులకు హెచ్చరిక: పత్తి నిల్వతో బాధ పడుతున్న రైతులు..

Share your comments

Subscribe Magazine

More on Education

More