వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందిని "మిషన్ మోడ్"లో నియమించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షించారు. వచ్చే 17 నెలల్లోపు 10 లక్షల ఉద్యోగాలను నియామకం జరిగేలా అన్ని శాఖలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. మార్చి 1, 2020 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర విభాగాలలో 40 లక్షలకు పైగా ఉద్యోగుల అవసరం ఉండగా , ప్రస్తుతం 32 లక్షల కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పుడు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటుంది.
కేంద్ర ప్రభుత్వం కొంత కాలం క్రితం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని (national recruitment agency) ఏర్పాటు చేసింది. రైల్వే , బ్యాంకు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష వేర్వేరుగా కాకుండా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఒకే పరీక్షని నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల నియామకం కొరకు కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS), రైల్వే ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) స్వయంగా నియామకాలు చేపడుతున్నాయి.
డిఫెన్స్ డిపార్ట్మెంట్లో దాదాపు 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయి. పోస్టాఫీస్ లో 90,000 ఖాళీలు , రెవెన్యూ శాఖలో సుమారుగా 74,000 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ కొరకు ఎదురుచూడకుండా ఇప్పటి నుండే సన్నద్ధం కావడం ఉత్తమం.
మరిన్ని చదవండి.
Share your comments