ప్రస్తుతం వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. కోళ్ల ఫారాలు వ్యవసాయం అనుబంధ రంగంలో ఎంతో ముఖ్యమైనది. ఈ త్రోవలులోనే బాతులా పెంపకం కూడా వస్తుంది. కోళ్ల పెంపకం తరవత అంతటి ప్రాముఖ్యకత బాతులా పెంపకానికి ఉంది, వాస్తవానికి కోళ్ల పెంపకంకంటే బాతులా పెంకం చాలా సులువు. అయినప్పటికీ సరైన అవగాహనా లేక ఎంతో మంది రైతులు బాతులా పెంపకం చేస్తున్నారు.
కోళ్ల పెంకంతో పోలిస్తే బాతులా పెంకనికి తక్కువ ఖర్చవుతుంది. బాతుల్లో రోగనిరోధక శక్తీ ఎక్కువగా ఉండటం వలన, వీటికి వ్యాధులు సోకే ప్రమాదం చాలా తక్కువ. పైగా బాతు మాంసానికి మరియు గుడ్లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండడంతో ఎక్కువమంది రైతులు వీటిని పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. వరి సాగు మరియు చేపల పంపకదారులకు బాతుల పెంపకం అదనపు ఆదాయం తెచ్చిపెడుతింది. వరి చేలలో బాతులను వదిలిపెట్టడం ద్వారా, పొలంలోని పురుగులను తిని పంటలను రక్షిస్తాయి, చేపల చెరువుల్లో వీటిని వదిలిపెట్టడం ద్వారా, వీటి విసర్జకాలు చేపలకు ఆహారంగా మారతాయి. బాతుల పెంపకం సరైన పద్దతిలో చేపడితే మంచి లాభాలు పొందవచ్చని వీటిని పెంచేవారు చెబుతున్నారు.
బాతుల్లో ఎన్నో రకాలున్నాయి, వాటిలో ఇండియన్ కాంపాల్ వంటి బాతు రకాల గుడ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. బాతులు దాదాపు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలవు, కాబట్టి వీటిని పెంచడం తేలిక, రోగనిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి, వీటిని పెంచే వారు వాక్సిన్లకు ఎక్కువుగా ఖర్చు పెట్టె అవసరం ఉండదు. బాతులను ఎక్కువగా పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పెంచుతారు. బాతులు వాటి ఆహారంగా ధాన్యపు గింజలు, చిన్న చిన్న పురుగులు, చిన్న చేపలు మరియు కప్పలు తిని పెరుగుతాయి, కాబట్టి వీటి ఆహారం కోసం ఎక్కువగా ఖర్చు చెయ్యవలసిన అవసరం కూడా ఉండదు.
బాతులు సాధారణంగా పగటిపూట మాత్రమే గుడ్లు పెడతాయి, కాబట్టి వీటిని సేకరించడం తేలికగా ఉంటుంది. కోళ్లకంటే ఎక్కువ మరియు బరువైన గుడ్లను పెట్టడం బాతులా లక్షణం, కోళ్లకంటే 40-50 ఎక్కువే పెడతయి, కనుక అధిక లాభం కలుగుతుంది. తక్కువ స్థలం ఉన్నవారు కూడా బాతుల పెంపకం చేపట్టవచ్చు. పెకింగ్, ముస్కోబి, ఎల్లిస్ బెర్రీ, రాయల్ కాగువా బాతులు మాంసానికి మార్కెట్లో ఎంతో ప్రత్యేకత ఉంది. ఖాకీ కాంప్బెల్ అనే బాతు రకం సంవత్సరానికి దాదాపు 300 గుడ్లను పెడుతుంది.
Share your comments