మన భారతదేశంలో పశువులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మనదేశంలో చాలా మాది రైతులు పశువులను పెంచుతూ ఉంటారు. ప్రపంచంలోనే భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉంది. అలాంటి పశువులకు ప్రస్తుతం బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. బ్రూసెల్లోసిస్ అనే వైరస్ పశువులకు చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యాధి మనుషులకు కూడా సోకుతుంది అని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి బ్రూసెల్లా అబార్షన్ అనే బ్యాక్టీరియా పశువులకు సోకుతుంది. దీనిని నివారించడానికి ప్రభత్వం తగిన చర్యలు చేపడుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా చూడి వసువులకు సోకుతుంది. కాబట్టి ప్రభత్వం చూడి పశువులకు మరియు ఆవు దూడలకు ఉచితంగా వాక్సిన్ వేయాలని నిర్ణయించినది. ఈ వ్యాధి పశువుల నుండి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది.
ఈ వ్యాధి సోకిన పశువుల్లో గర్భ విచ్ఛిత్తి జరుగుతుంది. పశువుల్లో ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకడం వలన వాటికీ 7, 8, 9, నెలల్లో గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. దీనితో పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా రైతులు తీవ్ర నష్ఠాలను చూడాల్సివస్తోంది. ఒకవేళ ఈ వ్యాధి మనుషులకు సోకినట్లయితే నపుంసకత్వం మరియు వృషణాల వాపు వంటివి వచ్చే అవకాశం ఉంది. మహిళలకు ఐతే అబార్షన్ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ పశ సంవర్ధక శాఖ ఈ వ్యాధిని నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. పాడి రైతులు కూడా ప్రభత్వ సూచనలను పాటించి పశువుల్లాకు టీకాలను వేయించాలి.
ఇది కూడా చదవండి..
భారీ ఎత్తున్న దేశీయ లాంపీ స్కిన్ వ్యాధి వాక్సిన్ ఉత్పత్తి ...
పశువులకు ఈ టీకాలు వేసే కార్యక్రమం ఈ నెల ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమైంది. పశువైద్యా అధికారులు ఇప్పటికే మండలంలో 684 బఱ్ఱె మరియు ఆవు దూడలకు ఈ బ్రూసెల్లా టీకాలు వేసినట్లు చెబుతున్నారు. ఈ వ్యాధికి వైద్యులు వ్యక్సీన్లను కనిపెట్టారు. కాబట్టి రైతులు కచ్చితంగా 4 నుంచి 9 నెలల వయస్సు ఉన్న ఆవు దూడలకు మరియు బర్రెలకు ఈ టీకాలను వేయించాలని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకినా పశువులకు వైద్యాన్ని అందించడానికి ప్రభుత్యం సమాచార వాహనాలను కూడా ప్రారంభించింది.
ఈ బ్రూసెల్లా టీకాలలను పశువులకు వేయించడం వలన రైతులు మేలు పొందుతారు. ఈ టీకాలు వేయించడం వలన పశువుల్లో గర్భ విచ్ఛిత్తిని అడ్డుకోవచ్చు. దీనితో పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి రైతులకు నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. రైతులు నిర్లక్ష్యం చేయకుండా ఈ వ్యాధి సోకుండానే పశువులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు కచ్చితంగా వేయించాలి అని తెలంగాణ పశ సంవర్ధక శాఖ సూచిస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments