Animal Husbandry

బ్రాయిలర్ కోళ్ళ పెంపకానికి అనువైన షెడ్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...!

KJ Staff
KJ Staff

వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన కోళ్ల పెంపకం ప్రస్తుతం దేశంలో బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే బ్రాయిలర్ కోళ్ళ మాంసం ఉత్పత్తిలో భారతదేశం 5వ స్థానంలో కొనసాగుతోంది.ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో స్వల్పకాలంలో అధిక లాభాలను సాధించాలంటే మొదట నాణ్యమైన కోడి పిల్లలను ఎంపిక చేసుకోవడంతోపాటు అనువైన షెడ్ నిర్మాణం ఏర్పాటు చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

అధిక పోషక విలువలున్న మాంసాన్ని ఇచ్చే బ్రాయిలర్ కోళ్ళను తక్కువ పెట్టుబడితో ఒక పరిశ్రమగా ప్రారంభించడానికి చాలా మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. బాయిలర్ కోళ్ల పెంపకం లో షెడ్డు నిర్మాణం,నీటి వసతి వంటి సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి అనువైన షెడ్డు నిర్మాణం, ప్రాముఖ్యత:

ముఖ్యంగా కోళ్ల రక్షణకు అనేక జాగ్రతలు తీసు కోవాల్సి ఉంటుంది. బాయిలర్ కోళ్లు అధిక వేడిని, అధిక చలిని తట్టుకోలేవు కాబట్టి కోళ్ల శరీర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వసతి కల్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.బ్రాయిలర్ కోళ్ల షెడ్ను తూర్పు, పడమర దిశలలో నిర్మాణం చేపట్టాలి దీంతో గాలి వెలుతురు సక్రమంగా అందుతుంది.షెడ్ పరిమాణం 25 అడుగుల వెడల్పు150 అడుగుల పొదువుతో ఏర్పాటు చేసుకోవాలి.

కోళ్లకు సులువుగా ధానా, నీళ్లు ఎప్పటికప్పుడు అందించేందుకు ట్రాలీలేర్పాటు చేసుకుంటే మంచిది.బ్రాయిలర్ షెడ్లోనికి స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరించేలా ఉండాలి. గాలి ప్రసరణ సరిగాలేని యెడల అమ్మోనియా, సల్ఫర్ డై ఆక్సైడ్ కార్బన్ డై ఆక్సైడ్ వంటి విషవాయువులు దీప్ లిట్టర్ నుండి విడుదలై బ్రాయిలర్ కోళ్ళకు శ్వాస సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.డీప్ లిట్టర్ పద్ధతిలో బ్రాయిలర్ కోళ్ళను పెంచేటప్పుడు ఫ్లోరింగ్ సిమెంట్ ఏర్పాటు చేసుకొనవలెను.

పౌల్ట్రీ షెడ్లు రేకులపై ఎండ తీవ్రత ఉండకుండా ఎప్పటికప్పుడు ట్యాంకుల ద్వారా నీళ్లను తుంపర్ల పద్దతిలో చల్లే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల బ్రాయిలర్ కోళ్ళ శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచవచ్చు. తద్వారా మరణాల రేటును తగ్గించవచ్చు. బాయిలర్ కోళ్ల షెడ్ పక్కనే లేయర్ కోళ్ళ షెడ్డు అసలు నిర్మించుకో రాదు. కోళ్ల పెంపకానికి అనువైన షెడ్డు నిర్మాణం లో తగిన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు రైతులు అధిక లాభాలను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine