వెనామీ రొయ్య పిల్లల ఎంపిక:
- వెనామీ రొయ్యలు పెంపకం లో ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను కోస్టల్ ఆక్వాకల్చర్ అధారిటీ వారిచే రిజిస్టర్ కాబడిన హేచరీల నుండి పీసీఆర్ పరీక్ష జరిపించుకుని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి
- ఎట్టి పరిస్థితులలోనూ సహజ వనరుల నుండి సేకరించిన రొయ్య పిల్లల పెంపకానికి వాడరాదు
- నాణ్యమైన నా వ్యాధి రహిత రొయ్య పిల్లలను ముఖ్యంగా మూడు దశలలో గుర్తించుకోవాలి అవి విజువల్ ఎసెస్మెంట్ పద్ధతి రెండు ఒత్తిడి పరీక్షలు ఇంకా మూడవ దశలో లాబరేటరీ పరీక్షలు జరిపి రొయ్యలు నాణ్యతను నిర్ధారించుకోవాలి
- ముందుగా విజువల్ ఎసెస్మెంట్ పద్ధతి లో రొయ్యలను పరిశీలించినప్పుడు రంగు లేత గోధుమ రంగు లేక బూడిద రంగులో ఉండే పారదర్శకంగా ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే ఎంచుకోవాలి
- ఎరుపు నీలం ఆకుపచ్చ రంగు గులాబీ రంగులో ఉన్న రొయ్య పిల్లలను తిరస్కరించాలి
- పోస్టు లార్వా దశ 9 నుండి 15 మధ్యలో ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి అంటే పిల్లలు 10 నుండి 15 మిల్లీమీటర్ల పొడవు కలిగి 4 నుండి 7 rostal spines కలిగి ఉండాలి
- ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లలు అన్నీ యూనిఫామ్ సైజులో ఉండాలి. కనీసం 95 శాతం పిల్లలు ఒకే సైజులో ఉన్న వాటిని మనం ఎంపిక చేసుకోవాలి
- ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లల కండరం ఆహార నాళం నిష్పత్తి 4:1 గా ఉండి ఆహార నాళం ఖాళీ లేకుండా ఆహారం తో నిండి ఉండాలి
- కండరాలు పారదర్శకంగా ఉండి అన్ని ఒకే సైజులో ఉపాంగాలు అంటే కాళ్లు మీసం తోక పూర్తిగా ఏర్పడి ఉండి ఎటువంటి కోరుకుడు గాని necrosis గాని లేకుండా ఉన్న రొయ్య పిల్లలను ఎంపిక చేసుకోవాలి
- తరువాత సుమారు ఐదు వందల రొయ్య పిల్లలను ఒక బేసిన్లో వేసి చేతితో తిప్పినప్పుడు రొయ్య పిల్లలు నీటి ప్రవాహానికి ఎదురీద గలిగే శక్తిని కలిగి ఉండాలి బేసిన్ మధ్యభాగంలో కానీ రొయ్య పిల్లలు చేరినట్లే అయితే రొయ్య పిల్లలు బలహీనంగా ఉన్నాయని గుర్తించి నిరాకరించాడు
- రెండవ దశలో రొయ్య పిల్లలకు ఫార్మలిన్ ఇంకా సెలినిటి ఒత్తిడి పరీక్షలు చేసి ఈ పరీక్షలో 90 నుంచి 95 శాతం బ్రతుకు దళ కలిగివున్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి
- మూడవ దశలో సుమారు ఐదు వేల రొయ్య పిల్లలను దగ్గరలో ఉన్న లేబరేటరీలో సాధారణంగా వచ్చే వ్యాధులు అయినటువంటి EHP, WSSV, IHHNV,IMNV, TSV వంటి వ్యాధుల నిర్ధారణకు PCR పరీక్షలు చేయించుకోని ఎటువంటి వ్యాధులు లేవని నిర్దారించుకుని చెరువుల్లో విడుదల చేసుకోవాలి.
Share your comments