సాధారణంగా మనం మన ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటాము. ముఖ్యంగా కుక్కలు అంటే చాలామంది ఎంతో ఇష్టంగా వాటిని పెంచుతుంటారు. ఈ క్రమంలోనే మనం చూపించే అతి ప్రేమ వల్ల ఆ కుక్కలు మనల్ని నాకడం, లేదా లాలాజలం కార్చడం, ముద్దులు పెట్టడం వంటివి చేస్తుంటాయి. ఈ విధంగా కుక్కలు ముద్దులు పెట్టడం, లేదా నాకడం వంటివి చేస్తే ప్రాణానికే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
కుక్క లాలాజలంలో "క్యాప్నోసైటోఫాగా కానిమోర్సస్" అనే ప్రాణాంతక బ్యాక్టీరియా ఉంటుంది. కుక్కలు మనల్ని కరిచినప్పుడు ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది. అయితే కుక్కలు కరవకపోయినా అవి వచ్చి ముద్దు పెట్టడం, లేదా మనల్ని నాకడం వంటివి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా చేసినప్పుడు మన శరీరంపై ఏవైనా గాయాలు ఉంటే ఆ గాయాల ద్వారా ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా ఎంతో ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా కుక్కలు ముద్దు పెట్టినప్పుడు ఆ బ్యాక్టీరియా మనలోకి ప్రవేశించిన తర్వాత మనలో చర్మంపై వాపు, ఎర్రని మచ్చలు ఏర్పడటం జ్వరం, కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, నొప్పులు వంటి లక్షణాలు కనబడతాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఎలాంటి నాటువైద్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం. ఈ విధంగా బ్యాక్టీరియా మనలోకి ప్రవేశించినపుడు ప్రాణాలు పోవడం చాలా అరుదుగా ఉంటుంది. అయినప్పటికీ కుక్కల నుంచి ముఖ్యంగా చిన్న పిల్లలను దూరంగా ఉంచడం ఎంతో సురక్షితం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Share your comments