ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పాడి సంపదకు ప్రాధాన్యత ఇచ్చి మరియు వాటిని అభివృద్ధి చేయడానికి అనేక చర్యలను చేపడుతుంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిని పెంచడానికి 'రాష్ట్రీయ గోకుల్ మిషన్' అనే పధకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పాడి సంపదను పెంచి, పాల ఉత్పతిని పెంచాలని యోచిస్తుంది. ఈ పథకంతో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడానికి రైతులకు ఇంజెక్షన్లను ప్రభుత్వం అందజేస్తుంది.
పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి 1962లో సంచార పశు వైద్యశాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలాంటి వైద్యశాలల ద్వారా పశువులకు సరైన రోగ నిర్ధారణ చేసి, మరియు పశువుల మరణాలను తగ్గించడానికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున లాబ్స్ ను ఏర్పాటు చేసింది. పాడి రైతులకు ప్రభుత్వం లింగ నిర్ధారణ వీర్యం ఇంజెక్షన్లను సబ్సిడీలపై ఈ పధకం కింద అందజేస్తుంది. ముఖ్యంగా మేలు జాతి ఆడ దూడల సంఖ్యను పెంచి, తద్ద్వారా పాల ఉంత్పతిని పెంచుతారు.
విజయనగరం జిల్లాకు సంబంధించిన 27 మండల్లాలో పాడి సంపదని పెంచడం అనేది ఈ పధకం యొక్క ఉద్దేశం. ఈ జిల్లాలో మెలి జాతి లింగ నిర్ధారిత వీర్యం ఉపయోగించి, ఆడ దూడలను ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ పధకం ద్వారా పాల ఉత్పత్తులను పెంచి, పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ సంవత్సరం 8 వేల పశువులకు ఈ లింగ నిర్ధారిత ఇంజెక్షన్లను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి..
కృషి కళ్యాణ్ అభియాన్ - ఉత్తమ జాతి పశువుల కోసం అద్భుత కార్యక్రమం
పథకం యొక్క మొదటి దశ ఇప్పటికే జిల్లా అంత ప్రారంభం అవ్వింది. ఈ వీర్య నాళికల ధర రూ.1350 ఉండగా ప్రభుత్వం రైతులకు కేవలం రూ.500 లకే సరఫరా చేస్తుంది. ఒకవేళ గర్భం దాల్చిన పశువు మెగా దూడకు జన్మనిస్తే కట్టిన మొత్తం తిరిగి చెల్లిస్తారు. పొరపాటున రెండో సారి సుధ మెగా దూడకు జన్మనిస్తే రూ.250 తిరిగి రైతులకు చెల్లిస్తారు.
ఈ పధకం కొరకు కావలసిన వీర్య కణాలను స్వదేశీ జాతులైన గిర్, సాహీవాల్ మరియు విదేశీ జాతులైన హెచ్ఎఫ్, జెర్సీ వంటి వాటి నుండి సేకరిస్తున్నారు. గేదెల్లో ఐతే ముర్రా జాతికి చెందిన వీర్య నాళికలు అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..
Share your comments