వ్యవసాయ అనుబంధ రంగాల్లో నాటుకోళ్ల పెంపకం అత్యంత లాభదాయుకంగా మారి కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటుగా పెరటి, నాటుకోళ్ల పెంపకంతో మంచి ఆదాయం పొందుతున్నారు. వీటి పెంపకంతో అనేక లాభాలు ఉన్నాయనే చెప్పాలి. గుడ్లు, మాంసం అమ్మకాలతో మంచి రాబడిని పొందవచ్చు. అలాగే, వాటి నుంచి వచ్చే కోళ్ల పోడ వ్యవసాయానికి ఏరువుగా కూగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో పాటు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టేవారు సైతం ఈ రకం కోళ్ల పెంపకంపై మొగ్గుచూపుతున్నారు. నాటుకోళ్లు, పెరటి కోళ్లల్లో అనేక రకాలు ఉన్నాయి. అయితే, వీటిలో కడక్ నాథ్ కోళ్లు రైతులు, పెంపకం దారులకు మంచి ఆదాయాలను అందిస్తున్నాయి.
ఎక్కడనుంచి వచ్చింది..ఈ కడక్ నాథ్ కోడి
అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటు కోడి పేరు కడక్ నాథ్. ఈ కోడి ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. ఈ కడక్ నాథ్ కోళ్ళను దీని స్వస్థలం అయిన మధ్యప్రదేశ్ లోకాలి-మాసి(నల్లని మాంసం కలది) అని పిలుస్తారు. ఇప్పటివరకు ఈ "కడక్ నాథ్" కోడి మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే స్థానిక జాతికి చెందిన నాటుకోడిగానే ఉంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో నివసించే గిరిజనులు, కొండ జాతులు, ఆదివాసి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల వారే ఈ కోళ్లను పెంచేవారు. అంతేకాదు వారు దీన్ని పవిత్ర మైన జాతిగా గుర్తించి దీపావళి పండుగలో దేవునికి నైవేద్యంగా పెడతారు. ఉత్తర భారతంతో పెంచే ఈ కడక్ నాథ్ కోళ్లను ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెంచుతున్నారు. మార్కెట్ లోనూ వీటికి డిమాండ్ అధికంగానే ఉంటుంది.
కడక్ నాథ్ కోళ్ల పెంపకం
కడక్ నాథ్ కొళ్లలో అధిక మత్తలో పోషకాలు ఉంటాయి. ఇవి చూడటానికి ముదురు నలుపు, ముదురు నీలం రంగులో ఉంటాయి. కడక్ నాథ్ కోళ్ల వెంట్రుకలు, చర్మం, మాంసం నలపు రంగులో ఉంటుంది. ఈ కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. వీటిని పెంచడానికి నాటు కోళ్లు పేంచే కోళ్ల ఫామ్ లతో పాటు, బాయిలర్ కోళ్ల పెంపకం కోసం ఉపయోగించే సాధారణ కోళ్ల ఫామ్ లలో కూడా వీటిని పెంచవచ్చు. ప్రస్తుతం కడక్ నాథ్ కోడి పిల్లలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని తెచ్చుకుని ఫామ్ లలో పెంచవచ్చు. 45 రోజుల్లోనే ఈ కోళ్లు అమ్మకానికి వస్తాయి. ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది. గుడ్ల కోసం పేంచే వాటిలో అధిక వృద్ధి శాతానికి షెడ్లల్లో ఆరు కోళ్ళకు, ఒక పుంజు ఉంటే సరిపోతుంది.
దాణా అందించడం
పల్లలుగా (తొలి దశలో) పొడి లేదా నూకల రూపంలో ఉంటే మేతను వీటికి అందించాలి. సాధారణంగా మార్కట్ లో కోళ్లకు ఉపయేగించే దాణాను వీటికి ఆహారంగా అందించవచ్చు. ఫామ్ లలో వీటికి నీటి కొరత లేకుండా ఎల్లప్పుడు అందుబాటులో ఉంటే విధంగా చూసుకోవాలి. ఎటువంటి వంట వ్యర్ధాలనైన అరిగించుకోగలడం వీటి ప్రత్యేకత.
సంరక్షణ చర్యలు/రోగ నిరోధక టీకాలు అందజేయడం
బాయిలర్ కోళ్ల పెంపకానికి తీసుకోవాల్సిన మాదిరిగానే అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమేముండదు. ఎందుకంటే కడక్ నాథ్ కోళ్లు సహజంగానే అధిక రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. అయితే, వీటికి కొక్కెర తెగులు వచ్చే అవకాశముంటుంది కాబట్టి పిల్లలకు 7వ రోజు, 28 రోజు కొక్కెర తెగులు నివారణ టీకాలు ఇవ్వాలి. అలాగే, 9, 18, 41, 56వ వారాల్లో కొక్కెర తెగులు నివారణకు టీకా అందివ్వాలి.
గుడ్ల కోసం చర్యలు
ఇతర కోళ్ల రకాలతో పోలిస్తే.. ఈ కడక్ నాథ్ కొళ్లల్లో పొదుగుడు లక్షణం తక్కువగా ఉంటుంది. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదిలో దాదాపు 100కు పైగా గుడ్లు పెడుతాయి. కోడి పిల్లలకు మొదటి 6 వారాల పాటు బ్రూడింగ్ పద్ధతిలో వేడిమి అందచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పెరటి పెంపకానికి అలవాటు చేయవచ్చు.
Share your comments