Animal Husbandry

పట్టు సాగుతో లాభాల పంట: వరంగల్‌లో పట్టు పరిశ్రమకు ఊపెత్తిన ప్రోత్సాహం

Sandilya Sharma
Sandilya Sharma
Silk industry India 2025- sericulture statistics India- Indian silk global share (Image Courtesy: Pexels)
Silk industry India 2025- sericulture statistics India- Indian silk global share (Image Courtesy: Pexels)

పట్టు ఉత్పత్తిలో భారతదేశం, ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలుస్తోంది (India silk production rank). చైనా తర్వాత అత్యధికంగా, ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 17 శాతం పట్టు భారత్‌లోనే ఉత్పత్తి అవుతోంది. ఈ పరిశ్రమ ప్రధానంగా గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రబలంగా ఉండి, దాదాపు 9.7 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. పట్టు ఉత్పత్తిలో మల్బరీ (Mulberry) పట్టు అత్యధికంగా ఉంటుంది. ఇది బహువార్షిక పంటగా నీటి వినియోగాన్ని పొదుపుగా చేస్తూ, అధిక ఆదాయాన్ని అందించగలదు (low water high income crops).

పట్టుపురుగుల పెంపకం (Mulberry silk farming in India)

పట్టు సాగులో కీలకమైన భాగం పట్టుపురుగుల పెంపకం. ఈ పెంపకం ద్వారా రైతులు నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,00,000 వరకు ఆదాయం పొందగలుగుతున్నారని జిల్లా సహాయ పట్టు పరిశ్రమ అధికారి అరవింద్ వెల్లడించారు. పట్టు ఉత్పత్తులు నేత, ఔషధ రంగం, చేపలు పట్టడం వంటి విభిన్న రంగాల్లో వినియోగంలో ఉన్నాయి. పట్టు నుండి తయారయ్యే రేష్మీ వస్త్రాలకు అంతర్జాతీయంగా విశేష ఆదరణ ఉంది (semi-urban silk livelihood).

తెలంగాణలో వరంగల్‌కు విశిష్ట స్థానం

తెలంగాణ రాష్ట్రంలో పట్టు పరిశ్రమ చేనేత రంగానికి వెన్నుముకగా నిలుస్తోంది. ఇందులో వరంగల్ జిల్లా రెండవ స్థానంలో ఉండటం గర్వకారణమని అధికారులు తెలిపారు. జిల్లాలో దాదాపు 100 కుటుంబాలు మల్బరీ సాగు చేస్తున్నారు. ఒక్క ఎకరా మల్బరీ తోట ఏడాది పొడవునా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తుంది (rural employment silk industry).

ఒకే సంవత్సరంలో పట్టు పంటలు 

ఒకే సంవత్సరంలో అత్యధికంగా పంటలు తీయగలిగే వ్యవసాయ పద్ధతి ,పట్టు పరిశ్రమ ప్రత్యేకత. అందుకే ఏడాదికి సుమారు 10 పట్టు పంటలు తీయడం సాధ్యపడుతోంది. దీనివల్ల రైతులు త్వరగా ఆదాయం పొందే అవకాశాన్ని కలిగి ఉండటం విశేషం. పైగా పట్టు సాగు భూముల్లో కూరగాయలు, మినుము పంటల్ని మల్టీక్రాపింగ్‌గా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయ అవకాశాలు కూడా లభిస్తున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం

ఈ లాభదాయక పంటను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం నుంచి మరింత సబ్సిడీలు, శిక్షణా కార్యక్రమాలు, మార్కెటింగ్‌ మద్దతు, నాణ్యమైన పట్టు పురుగులు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పట్టు సాగు పట్ల యువతను ఆకర్షించాలంటే ఆధునిక పద్ధతుల పరిచయం కీలకం కానుంది.

పట్టు పరిశ్రమ కేవలం ఒక వ్యవసాయ విధానం మాత్రమే కాదు – గ్రామీణ కుటుంబాలకు జీవనాధారం, నిరంతర ఆదాయానికి మార్గం కూడా. వరంగల్ జిల్లా ఉదాహరణగా నిలుస్తూ తెలంగాణలో పట్టు సాగు విస్తరణకు దారితీస్తోంది.

Read More:

“మిద్దె తోటలు భవిష్యత్తు” – తెలంగాణ రైతు మేళాలో అర్బన్ అగ్రికల్చర్‌కు కొత్త ఊపిరి

పత్తి తేలికే, కానీ విత్తనమే బరువు

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More