పశువుల్లో వచ్చే అంటువ్యాధుల్లో గాలికుంటూ వ్యాధి ముఖ్యమైనది. ఈ వ్యాధినే ఇంగ్లీష్‌లో ఫుట్ అండ్ మౌతే డిసీస్ అనికూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన పశువులు నోటిలోను మరియు కాలి గిట్టల మధ్య ఫుల్లు ఏర్పడి పశువులు సరిగ్గా నడవలేవు అలాగే మేత కూడా తినలేవు దీని వలన పాలాదిగుబడి మరియు నాణ్యత తగ్గిపోతాయి. కలుషితమైన గాలి నుండి మరియు తల్లి పశువుల నుండి దూడలకు ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి పశువులకు రక్షణ కల్పించాలి. ఈ వ్యాధి సోకకుండా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టీకాలను అందించాడం మంచిది.
అయితే గతంలో ఈ వ్యాధి సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో ఎక్కువుగా వ్యాప్తి చెందేంది, కానీ ప్రస్తుతం అన్ని మాసాల్లోనూ ఈ వ్యాధి పశువులకు సోకుతుంది, కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉంటూ పశువులకు రక్షణ కల్పించవలసి ఉంటుంది. వర్షాకాలం ప్రారంభమయ్యింది, పశుపోషకులు ఇది ఒక గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఈ కాలంలో వ్యాధులు ప్రబలిల్లె అవకాశం ఎక్కువుగా ఉంటుంది. గాలికుంటు వ్యాధి వైరస్ వ్యాధి, ఈ వ్యాధిని సమగ్రవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గాలికుంటు వ్యాధి గిట్టలు రెండుగా చీలి ఉన్న పశువులకు ఎక్కువుగా సోకుతుంది, కాబట్టి ఈ వ్యాధి జీవాలకు మరియు పాడిపశువుల సోకే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో పాల దిగుబడి అమాంతం పడిపోతుంది, దీంతోపాటు పశువులు ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. పశువుల్లో వచ్చే వ్యాధులు అన్నిటితో పోలిస్తే ఈ వ్యాధి ఎక్కువుగా ఆర్ధిక నష్టాన్ని కలిగిస్తుంది.
ఈ వ్యాధి వచ్చిన పశువులు కాళ్ళ గిట్టల మధ్య ఫుల్లు ఏర్పడటం, నోటిలో ఫుల్లు ఏర్పడి నోటి నుండి ద్రవం కారడం, పశువుల శరీర ఉష్ణోగ్రత పెరిగి నిరసించిపోవడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు. అంతేకాకుండా వ్యాధి సోకిన పశువుల పాలు తగిన దూడలు ఉన్నటుంది మరణిస్తాయి, కనుక దూడలను వ్యాధి లక్షణాలున్న పశువుల నుండి దూరంగా ఉంచాలి. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువుగా ఉన్న పశువుల్లో ఒక్కోసారి పొడుగువాపు వ్యాధి కూడా వచ్చేందుకు అవకాశం ఎక్కువుగా ఉంటుంది. పాడిపశువులతో పాటు జీవాలలో కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి, మరియు వాటి పిల్లలో మరణాలు ఎక్కువుగా సంభవిస్తాయి. ఈ వ్యాధి ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతుంది, వ్యాధి సోకిన పశువు నుండి వచ్చే తుంపర్లు, నోటినుండి కారే స్రావం ఇలా ఎన్నో విధాలుగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ గాలిద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది కనుక ఒక ఊరిలో ఉన్న చాలా పశువులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ.
గాలికుంటూ వ్యాధి సోకకుండా ఉండేందుకు రైతులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. షెడ్ పరిసరప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధి ఉందని అనుమానం ఉన్న పశువులను మిగిలిన పశువులకు దూరంగా ఉంచాలి. ఇలాంటి సమయాల్లో షెడ్ మొత్తం యాంటిసెప్టిక్ స్ప్రే చేసుకోవడం చెయ్యాలి. ఈ వ్యాధి సోకకుండా ముందస్తు చర్యగా రైతులు దీనికి సంబంధించిన టీకాను వెయ్యించాలి. ఈ టీకాను సంవత్సరానికి రెండుసార్లు వెయ్యించాలి, ప్రభుత్వం కూడా ఈ వ్యాధిని నిర్ములించడానికి ఉచితంగా టీకాలను అందిస్తుంది. రైతులు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. వ్యాధి సోకినా పశువులను నయం చెయ్యడానికి పొటాషియం పెర్మెన్గనెట్ సొల్యూషన్ నీటిలో కలిపి కళ్ళు మరియు నోటిలోని పూతను శుభ్రం చెయ్యాలి, తర్వాత బొరాక్స్ పేస్ట్ పుల్లమీద రాయడం వలన పశువులకు నొప్పి తగ్గి తిరిగి మల్లి కోలుకోవడానికి సహాయపడుతుంది.
Share your comments