ప్రస్తుత కాలంలో వ్యవసాయం నుండి అధిక లాభాలు ఆర్జించడం కాస్త కఠినతరమనే చెప్పవచ్చు. ఇందుకు తగ్గట్టుగానే రైతులు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధం రంగాల మీద కూడా ద్రుష్టి సారించవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ త్రోవలోనే వ్యవసాయ అనుబంధ రంగంగా జీవాల పెంపకం విస్తరిస్తుంది. అయితే వర్షాకాలంలో జీవాలను రోగాల భారిన పడకుండా కాపాడుకోవడం రైతుల ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుత వర్షకాలం జీవాలకు కాస్త గడ్డు కాలం వంటిది.
పచ్చగడ్డి కోసం ఆరుబయట తిరిగే జీవాలు, వర్షంలో తడవడమే కాకూండా కొన్ని సార్లు మురుగు నీటిని కూడా తాగే ప్రమాదం ఉంటుంది. అంతే కాకూండా వర్షాకాలంలో, షెడ్ పరిసరలు శుభ్రం లేక, దోమలు, ఈగలు చేరి, రోగాలు ప్రబలమయ్యేలా చేస్తాయి. అంతేకాకూండా జీవాల్లో వ్యాధులు సులభంగా వ్యాప్తి చెందుతాయి.
వర్షాకాలంలో జీవాల్లో అనేక వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. వీటిలో చిటుకు వ్యాధి ప్రధానమైనది. ఈ వ్యాధి సోకిన జీవాల్లో ఎటువంటి లక్షణాలు కనబడవు, ఏవి పళ్ళు కొరకడం, తూలుతూ నడవడం మరియు గెంతుతూ ఉంటాయి. వ్యాధి తీవ్రత ఎక్కువైనట్లైతే, జీవాలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ వ్యాధిని అరికట్టడానికి, వర్షాకాలం ఆరంభంలోనే, వీటికి టీకాలు వెయ్యించాలి. వ్యాధి లక్షణాలు కనబరిచే జీవాలకు యాంటీబయోటిక్ మందులు వేయించినట్లైతే, వీటిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ఈ వర్షాకాలంలో గోరెల్లో నీలి నాలుక వ్యాధి కూడా ఎక్కువుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాల్లో శరీర ఉష్ణోగ్రత ఎక్కువుగా ఉంటుంది, తరువాత నోటిలో, ఫుల్లు ఏర్పడటం, మరియు నాలుక మీద రంద్రాలు రావడం గమనించవచ్చు. వ్యాధిని సరైన చికిత్స అందించకుంటే జీవాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. జీవాల్లో వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించి, పెన్సిలిన్ లాంటి మందులను అందించాలి. జ్వరతీవ్రతను మరియు నొప్పులను తగ్గించడానికి మెలొక్సికామ్ అనే మందును ఇవ్వాలి
Share your comments