ప్రతి కాలంలోనూ పాడి రైతులను ప్రధానంగా వేదించే సమస్య పశుగ్రాసాల లభ్యత. పాడి పశువులకు, అందిచవల్సిన దాణాతో పాటు, పచ్చి గడ్డి మరియు ఎండు గడ్డి అత్యంత కీలకం. నాణ్యమైన పశుగ్రాసాలు అందించడం ద్వారా పశువుల్లో పాల ఉత్పత్తితో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది. పశువుల్లో ఆరోగ్యాన్నిపెంపొందిచడంలో కూడా పశుగ్రాసం దోహదపడుతుంది. అయితే ఇన్ని అవసరాలు ఉన్న పశుగ్రాస లభ్యత మాత్రం కొందరు రైతులకు గుదిబండగా మారుతుంది, ఎటువంటి గ్రాసాలు పెంచాలి, మరియు ఎలా పెంచాలి అనే విషయాల మీద అవగాహన లేకపోవడం దీనికి ముఖ్య కారణం. ఈ ఆర్టికల్ ద్వారా పశుగ్రాసాల సాగు గురించి సమగ్రంగా తెలుసుకుని మీ సందేహాలు నివృత్తి చేసుకోండి.
పశుగ్రాసాల్లో రకాలు:
పశుగ్రాసాలు రెండు రకాలు ఒకటి ధాన్యపు జాతికి చెందినవి ఇంకోటి పప్పు జాతికి చెందినవి. పప్పు జాతికి చెందిన వాటిలో లూసర్న్ ఎక్కువగా పండిస్తారు. లూసర్న్ పండించడం ద్వారా రైతులు సంవత్సరం మొత్తం పశుగ్రాసంగా ఉపయోగించ్చుకోవచ్చు. అలాగే గడ్డి జాతికి చెందిన వాటిలో నేపియర్ గ్రాస్ ఎక్కువుగా సాగు చేస్తుంటారు. నేపియర్ ఒక్కసారి నాటితే 4-5 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. సాగు నీటి లభ్యత అధికంగా ఉన్న రైతులు ఈ పశుగ్రాసాలను పెంచుకోవడం ద్వారా, వారి పాడి పశువులకు మంచి మేతను అందించగలరు. పచ్చి గడ్డిని మేతగా వేసేటప్పుడు, ధాన్యపు జాతి రకాలు, పప్పు జాతి రకాలను 2:1 నిష్పత్తిలో వెయ్యాలి. గడ్డిని చోప్ కట్టర్ తో చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువులకు అందించడం ద్వారా, గ్రాసం వృథాను తగ్గించి, పశువులకు ఎక్కువ గడ్డిని అందించవచ్చు. హెడ్జ్ లూసర్న్ , సుబాబుల్, అవిశ వంటి రకాలను కాళీ ప్రదేశాల్లోనూ, పొలం గట్లమీద పెంచి పశువులకు మేతగా ఉపయోగించచ్చు.
అంతే కాకుండా పచ్చిగడ్డి లభించ్చని, క్లిష్ట పరిస్థితుల్లో యూరియా గడ్డిని ప్రత్యమాన్యంగా వాడుకోవచ్చు. యూరియా వరి గడ్డిని తయారుచేసుకునేందుకు, ఒక టన్ను వారి గడ్డికి 40 కిలోల యూరియాను, 600 లీటర్ల నీటికి కలిపి, భూమి అడుగున మాగావేసుకోవాల్సి ఉంటుంది. మాగావేసుకోవడానికి, గడ్డిని ఒక గుంటలో వేసి పొరలు పొరలుగా గడ్డిని, యూరియా ద్రావణాన్ని పోస్తూ రావాలి. ఇలా చేసి ఒక పది రోజుల పాటు గుంతను కప్పిఉంచాలి. ఇలా తయారైన దానినే యూరియా గడ్డి అంటారు, ఈ గడ్డిలో 4% మాంశకృతులు, జీర్ణమయ్యే పోషకాలు 50-60% వరకు ఉంటాయి. కానీ ఈ గడ్డిని అత్యవసర పరిస్థుతుల్లో మాత్రమే వాడాలి మరియు లేగ దూడలకు ఈ గడ్డిని వాడకూడదు.
గడ్డి, మరియు రోజూ అందించ్చే దాణా తో పాటు, పాడి పశువులకు అవసరమయ్యే నీటిని కూడా సమపాలలో అందించాలి. ప్రతి పది కిలోల శరీర బరువుకు ఒక లీటర్ నీటిని చొప్పున అందించాలి. నీటిని అందించ్చడం ద్వారా,ఆహరం సరిగ్గా జీర్ణమై పాల ఉత్పత్తి పెరుగుతుంది,
Share your comments