Animal Husbandry

పశువుల్లో వచ్చే పాదాల వ్యాధి-నివారణ చర్యలు ఎంటో తెలుసా?

KJ Staff
KJ Staff
Animal Health
Animal Health

వర్షకాలంలో పశువుల సంరక్షణ కోసం అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అధిక వానలు, వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా ఈ కాలంలో పశువులకు అనేక రకాలు రోగాలు వస్తుంటాయి. వాటిలో ఒకటి పాదల రోగం. ఈ రోగం కారణంగా పశువుల కాళ్ల వాపుతో పాటు అడుగుల కూడా వాపుకు గురవుతాయి. దీని కారణంగా అవి సరిగ్గా నడవలేవు. పరిస్థితి మరింత దిగజారితే ఈ పాదాల రోగం వచ్చిన పశువులు మొత్తంగా నడవలేని స్థితికి చేరి, కుంటివాటిగా మారే అవకాశం కూడా ఉంటుంది. అలాగే, మేతను సైతం సరిగ్గా మేయలేవు. దీని కారణంగా పశువులు నీరసించిపోతాయి. ఇది అంటువ్యాధి కాబట్టి ఇతర పశువులు కూడా ప్రభావితం అవుతాయి. అన్ని వయస్సుల పశువులకు పాదల తెగులు (పాదల వ్యాధి) వస్తుంది.

ఈ వ్యాధి ఫ్యూసోబాక్టీరియం నెక్రోఫోరం బ్యాక్టీరియా వలన వస్తుంది. పశువులు ఉంటే పరిసరాలు శుభ్రంగా లేకపోవడ, పశువులు ఎక్కువ సమయం వాటి పేడ, మూత్ర విసజర్జనల్లో ఎక్కువ సమయం ఉండటం వల్ల వ్యాధి కారక బ్యాక్టీరియాలు సంక్రమిస్తాయి. దీని కారణంగా కాళ్ల మొదలు వాపుతో పాటు పగుళ్లకు కారణమవుతుంది. శరీరంపై గాయాలు ఉంటే ఈ బ్యాక్టీరియా త్వరగా సంక్రమిస్తుంది. ఇతర బ్యాక్టీరియాలతో కలిసి వ్యాధి ప్రభావాన్ని మరింతగా పెంచుతాయి. చర్మంపై గాయాలు సైతం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంకెల మధ్య (గిట్టల) ఖాళీ ప్రదేశం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. చికిత్సను ఆలస్యం చేస్తే.. పశువు అధిక జ్వరం బారినపడి.. నడవలేని స్థితికి చేరుతాయి. అడుగులు తీవ్రంగా దెబ్బతిని కోలుకోలేని స్థితికి సైతం చేరుతాయని పశువైద్య నిపుణులు చెబుతున్నారు.

పాదాల వ్యాధిని గుర్తించిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే సంబంధిత పశువులను శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. నొప్పిని నివారించడానికి మందులు వాడాలి. యాంటిబయాటిక్స్ సైతం వాడవచ్చు. ఈ వ్యాధికి సంబంధంచి ప్రస్తుతం టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వ్యాధి సోకిన పశువుల పరిస్థితికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. కాబట్టి పశువైద్యుల సలహాలు, సూచనలు కీలకం.  దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ‘సూపర్ ఫుట్ రాట్’ సంక్రమిస్తోంది. కాబట్టి పశువుల పాదాలకు సంబంధించిన వ్యాధుల విషయంలో వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలని పశువైద్యులు సూచిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine