Animal Husbandry

దేశీపశుగణాల్లో మేలు జాతి రకాల ఏమిటో మీకు తెలుసా?

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ఎంతోమంది రైతులు పాలదిగుబడి ఎక్కువుగా ఉంటుందన్న ఉదేశ్యంతో విదేశీ జాతులను పోషిస్తున్నారు, వీటినుండి పాల దిగుబడి ఎక్కువుగా ఉన్నా, మన దేశంలో వాతావరణ పరిస్థితులును తట్టుకోలేవు, అలాగే విదేశీ జాతి పశువులు ఎక్కువుగా రోగాల భారిన పడతాయి, కాబట్టి రైతులు ఎక్కువుగా ఖర్చు చెయ్యవలసి ఉంటుంది. అదే స్వదేశీ పసువులైతే, మన వాతావరణంలో చక్కగా ఇమిడిపోవడమే కాకుండా, ఎక్కువ రోగనిరోధక శక్తిని కూడా కలిగి ఉంటాయి. అంతేకాకుండా దేశీ పశువుల మూత్రం మరియు పేడ సేంద్రియ వ్యవసాయంలో వినియోగించుకోవడానికి అనువుగా ఉంటాయి.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమకు ఎప్పటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పాడి పరిశ్రమనుండి వచ్చే పాలు, మరియు ఇతర పాలపదర్ధాలకు ఎల్లపుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి, పశుపోషకులు ఎల్లపుడు మంచి ఆదాయం లభిస్తుంది. అయితే ఎంతోమంది పాడి రైతులు, అధిక పాలాదిగుబడి వస్తుందని, విదేశీ జాతులకు చెందిన సంకరజాతులను ఎక్కువుగా పెంచుతున్నారు. దీనితో దేశీపశువులు తగ్గిపోతున్నాయి, కొన్ని జాతుల దేశీపశువులు అంతరించిపోతున్నాయి. దేశీ జాతులను కాపాడుకోవడం మన బాధ్యత. ప్రస్తుతం దేశీపశువుల పాలు మరియు పాల పదార్ధాలకు డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి రైతులు కూడా వీటిని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని మేలు జాతి స్వదేశీ గో జాతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గిర్:

పాడిపశుపోషకులకు గిర్ జాతి ఆవుల గురించి చెప్పనవసరం లేదు. గిర్ జాతి ఆవు, గుజరాత లోని గిర్ అడవుల్లో నుండి వచ్చింది, కనుక దీనికి ఆ పేరువచ్చింది. గిర్ జాతి ఆవులు అధిక పాల్ దిగుబడిని ఇవ్వగలవు, ఇవి ఒక సంవత్సరంలో 2,200 లీటర్ల పాలు ఉత్పత్తి చెయ్యగలవు అలాగే పాలలోని వెన్నశాతం 4-6% మధ్యలో ఉంటుంది. ఇవి భారతదేశంలోని అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి, అలాగే రోగనిరోధక శక్తీ కూడా ఎక్కువుగా ఉంటుంది. అయితే షెడ్ లోపాలు మరియు బయట సరైన శుభ్రత పాటించకుంటే, వీటికి పొడుగువాపు వ్యాధి సోకేందుకు అవకాశం ఎక్కువుగా ఉంటుంది, కాబట్టి రైతులు జాగ్రత్త పాటించాలి.

సాహీవాల్:

పాకిస్థాన్లో పుట్టిన ఈ జాతి ఆవులు, హర్యానా మరియు పంజాబ్ తోపాటు, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ జాతి ఆవులు లేత ఎరుపురంగుతో, శరీరం మీద అక్కడక్కడా తెల్లని మచ్చలు ఉంటాయి. గిర్ జాతి తరువాత సాహీవాల్ జాతి ఆవులు అధిక పాలాదిగుబడిని ఇస్తాయి. ఒక ఏడాదికి 1600-2700 లీటర్ల వరకు పాల దిగుబడి ఉంటుంది, మరియు పాలలోని వెన్న 4.5 శాతం ఉంటుంది. సాహీవాల్ జాతి పశువులను బాహ్యపరాన్నజీవులు ఎక్కువుగా ఆశిస్తాయి కాబట్టి, సరైన యజమాన్య చర్యలు పాటించడం అవసరం.

ఒంగోలు:

ఒంగోలు జాతి ఆవులను మన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు, వీటికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎంతో ఆధరణ ఉంది. ఒంగోలు జాతి ఆవులను కేవలం పాలకోసం మాత్రమే కాకుండా వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయి. గిత్తలను ఎండ్ల బళ్ళు లాగడానికి, మరియు పోటీల కోసం ఉపయోగిస్తారు. అయితే వీటిలో పాల దిగుబడి మిగిలిన జాతులతో పోలిస్తే తక్కువుగా ఉంటుంది, 1000-2000 లీటర్లు పాలదిగుబడినిస్తాయి, పాలలో వెన్న శాతం 3.4-3.5% ఉంటుంది. మిగిలిన జాతులతో పోలిస్తే వీటిలో రోగనిరోధక శక్తీ అధికంగా ఉంటుంది.

కాంక్రేజ్:

ఒంగోలు జాతిలాగా ఈ కాంక్రేజ్ జాతి కూడా పాల ఉత్పత్తితోపాటు వ్యవసాయ అవసరాలకు కూడా అనువుగా ఉంటుంది. ఈ జాతి ఆవులు ఎక్కువుగా గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువుగా కనిపిస్తాయి. ఇవి తెలుపు, లేత ఎరుపు మరియు నలుపురంగులో కనిపిస్తాయి. వీటి కొమ్ములు నిటారుగా ఉంటాయి. కాంక్రేజ్ జాతి ఆవులు 1700-1900 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇవ్వగలవు. ఒంగోలు ఆవుల్లాగానే వీటికి కూడా బలమైన రోగనిరోధక శక్తీ ఉంటుంది.

థార్పార్కర్:

ఈ జాతి ఆవులు, తెలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి, అయితే ఈ జాతి ఆవుల్లో పాల దిగుబడి చాలా తక్కువ, కేవలం 800-1000 లీటర్ల వరకు మాత్రమే పాల దిగుబడి ఉంటుంది. అయితే మిగిలిన జాతి ఆవులతో పోలిస్తే వెన్న శాతం ఎక్కువుగా ఉంటుంది, సుమారు 5% వెన్న ఉంటుంది. ఈ జాతి ఆవుల్లో రోగనిరోధక శక్తీ కూడా ఎక్కువుగా ఉంటుంది.

 

పాల ఉత్పత్తిలో, ఆవులతోపాటు, గేదెలుకూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రజలు కూడా ఆవు పాలకంటే గేదెపాలకే ఎక్కువ ప్రాధ్యానత ఇస్తారు. అయితే గేదెల్లో స్వదేశీ మేలు జాతి గేదెలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ముర్రా:

అన్ని గేదె జాతుల్లోకెల్లా ముర్రా జాతి గేదెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటిని హర్యానా, పంజాబ్ మరియు ఢిల్లీ ప్రాంతాల్లో ఎక్కువుగా కనిపిస్తాయి. ఈ జాతి గేదెలు ముదురు నలుపు రంగులో ఉంటాయి, అలాగే నుదురు మరియు తోక మీద తెల్లని వెంట్రుకలు కనిపిస్తాయి. ఒక ఏడాదికి 1700-2500 లీటర్ల వరకు పాల దిగుబడి ఉంటుంది, అలాగే పాలలో 7.5-8.0% వెన్న ఉంటుంది.

జాఫ్రాబాది:

జాఫ్రాబాది గేదెలు, నలుపు రంగులో ఉంది, వీటి కొమ్ములు చెవుల కిందకి ఉంది, ఒంపు తిరిగి ఉంటాయి. జెడేజాతులు అన్నిటిలోకెల్లా జాఫ్రాబాది గేదెలు యొక్క బరువు ఎక్కువుగా ఉంటుంది. ఈ జాతి గేదెల్లో పాల దిగుబడి కూడా అధికంగా ఉంటుంది ఒక ఏడాదికి సుమారు 2100-2300 లీటర్ల వరకు పాలాదిగుబడి ఉంటుంది, అలాగే 7.8% వెన్నదిగుబడి కూడా ఉంటుంది.

Share your comments

Subscribe Magazine