కేజ్ కల్చర్ అంటే సముద్రంలో పివీసీ పైపులతో ఒక పంజరం వంటి కట్టడాలను ఏర్పాటు చేసి వాటిలో చేపలను పెంచుతారు. దీనినే కేజ్ కల్చర్ అంటారు. ఆర్కే బీచుకు దగ్గర సముద్రంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కేజ్ కల్చర్ కొరకు పరిశోధనలు చేయడానికి కేజ్ లను అమర్చి పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ కేజ్ కల్చర్ లో పెంచిన చేపలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ కేజ్ కల్చర్ ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రాయితీలను ఇచ్చి కేజ్ ఏర్పాట్లు చేస్తుంది.
ఈ కేజ్ కల్చర్ కొరకు కేజ్‌లను నిర్మించడానికి పీవీసీ పైపులను మరియు రబ్బర్ ట్యూబులను వాడతారు. ఈ కేజ్ యొక్క లోతు వచ్చేసి 4 మీటర్లు ఉంటుంది మరియు వ్యాసార్థం అనేది 6 మీటర్లు ఉంటుంది. వీటితో పాటు వెదురు, ప్లాస్టిక్ డ్రమ్ములను కూడా వాడుకోవచ్చు. ఈ కేజ్‌లు సముద్రంలో కొట్టుకుపోకుండా ఉండటానికి యాంకర్ మరియు చైన్లతో ఏర్పాటు చేసారు.
ఈ విధంగా విశాఖ జిల్లాలో ఈ కేజ్ కల్చర్ ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా ఏర్పాటు చేసిన కేజ్ లో పండుగప్ప అనే రకం చేపలను పెంచుతున్నారు. మార్కెట్ లో కూడా ఈ పండుగప్ప చేపలకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ పండుగప్ప చేపలను రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ నుండి తీసుకువచ్చి ఈ కేజ్ కల్చర్ పద్దతిలో పెంచుతున్నారు. ఈ పండుగప్ప చేపకు మార్కెట్ లో ధర వచ్చేసి కిలోకి రూ.500 నుండి 700 వరకు ఉంది. ఈ చేపలకు పూర్తి స్థాయిలో పెరగడానికి 10-12 నెలల సమయం పడుతుంది. పూర్తిగా ఎదిగాక 2 నుండి 3 టన్నుల వరకు దిగుబడి అనేది ఒక్కో కేజ్ నుండి వస్తుంది.
ఇది కూడా చదవండి..
కొత్త మత్స్యకారుల సహకార సంఘాల నమోదు ప్రారంభం...
మత్స్యకారులకు ఈ నాకేజ్ యూనిట్లను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా అందజేస్తున్నారు. వివిధ రకాల వర్గాలకు ప్రభుత్వం సబ్సిడీలను కూడా ఇస్తుంది. ఎస్సి, ఎస్టీ మత్స్యకార మహిళలకు 60 శాతం మరియు బీసీ మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీలను ప్రభుత్వం అందిస్తుంది.
ఒక్కొక్క యూనిట్ ధర వచ్చేసి 5 లక్షలు వరకు ఉంటుంది. ఇందులో 40 లేదా 60 శాతం సుబీసీడీ కింద పోతుంది, 30 శాతం వరకు బ్యాంకు రుణంగా ఇస్తుంది, కేవలం 10 శాతం వాటా మాత్రమే లబ్ధిదారుడు భరించాలి. ఈ విధంగా మొత్తానికి విశాఖ జిల్లాకి 18 యూనిట్లు మంజూరు అయ్యాయి.
ఈ కేజ్ లకు సంబంధించి అన్ని రకాల అవసరాలను సిఎంఎఫ్ఆర్ఐ చూసుకుంటుంది. చేపల మేత నుండి రవాణా వారికు అన్ని వీరి పర్యవేక్షణ లోనే జారుతున్నాయి.
ఇది కూడా చదవండి..
Share your comments