పొడవైన సముద్ర తీరం మరియు అనేక మంచి నీటి వనరులు ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ వనరుల సహాయంతో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది. చేపలు మరియు రొయ్యలు పెంపకానికి మరియు ఎగుమతికి కోస్తా ప్రాంతాలు మంచి పేరును సంతరించుకున్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఆక్వా కల్చర్‌లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో ఆక్వా రైతులు కేజ్ కల్చర్ విధానాన్ని విరివిగా వాడుతున్నారు, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను సమకూర్చే ఈ విధానం రైతుల్లో ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
ఈ కేజ్ కల్చర్ మంచినీటి సరస్సులు మరియు సముద్రం పైన వినియోగించుకునేందుకు అనువుగా ఉంటుంది. ఈ విధానాన్ని చేపడుతున్న రైతులు మంచి దిగుబడులు మరియు అధిక లాభాలు పొందుతున్నారు. కేజ్ కల్చర్‌లో పెంచిన చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో, రైతులు ఈ పద్దతిని పాటించేందుకు ఆశక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ పద్దతిని పాటిస్తున్న రైతులకు ప్రోత్సహకాలను మరియు కేజ్ కల్చర్‌కి అవసరమైన సామగ్రిని అందిస్తుంది. కేజ్ కల్చర్ ద్వారా పండుగప్ప మరియు పంపానో వంటి చేపలను సాగు చెయ్యడానికి అనువుగా ఉంటుంది. ఈ కేజ్ కల్చర్ కు సంబంధించి కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సిఎంఎఫ్ఆర్ఐ ) ఎన్నో ఏళ్ల నుండి పరిశోధన జరుపుతుంది. నీటి ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాలు మరియు సముద్ర తీర ప్రాంతాల్లోని ఔత్త్సహికులైన రైతులను గుర్తించి కేజ్ వారి చేత కేజ్ కల్చర్ విధానాన్ని చేయిస్తున్నారు.
అయితే ఈ కేజ్ కల్చర్ చూడటానికి నీటిపైనా తేలియాడే జాలీలు మరియు నెట్ల మాదిరిగా కనిపిస్తుంది,వాటిలో వివిధ రకాల చేపలను పెంచుతారు. రైతులు సాధారణంగా చేపట్టే చేపల పెంపకంకన్నా ఈ విధానానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ కేజుల నిర్మాణానికి ప్లాస్టిక్ పైపులు, వెదురు కర్రలు, ప్లాస్టిక్ డ్రమ్ములను ఫ్రేమ్ లాగా వినియోగిస్తారు, వీటికి ఔటర్ మరియు ఇన్నర్ నెట్లు అమర్చి వీటిలో చేపల పెంపకం చేపడతారు. నీటి ప్రవాహానికి కేజ్‌లు కొట్టుకుపోకుండా చైన్లను యాంకరింగుకు కోసం వినియోగిస్తారు. ఇప్పటికే చాలా మంది రైతులు వీటిని వినియోగిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు.
రైతులు ఈ పద్దతిని వినియోగించాలి అన్న ఉదేశ్యంతో ప్రభుత్వం ఎన్నో ప్రోత్సహకాలు, కేజ్ కల్చర్ చేస్తున్న రైతులకు చేప పిల్లలు, కేజ్ కల్చర్ కు సంబంధించిన సామాగ్రిని అందిస్తున్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం (PMMSY) ద్వారా మత్స్యకారులు మరియు మరియు వివిధ కులాల మహిళలకు ఓపెన్ కేజ్ యూనిట్లు ప్రభుత్వం తరఫునుండి మంజూరు చేస్తున్నారుఆ, అంతేకాకుండా ఈ పద్దతిని పాటించడానికి అవసరమైన శిక్షణ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారు మహిళలకు 60%, బీసీ మహిళలకు 40% రాయితీలను అందిస్తున్నారు. ఒక్కో యూనిట్ మార్చుకోవడానికి దాదాపు 5 లక్షలు కావలి, దీనిలో 10% లబ్ధిదారుడు భరించారు, ప్రభుత్వం 40-60% రాయితీ ఇవ్వగా మిగిలిన భాగాన్ని బ్యాంకులు రుణాల రూపంలో అందిస్తాయి. ఈ కేజుల్లో పండుగప్పల చేపలను పెంచుతున్నారు, వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువుగా ఉండటంతో రైతులు కూడా వీటిని పెంచేందుకు ఆశక్తి చూపుతున్నారు. ఈ చేపలు 10-12 నెలల్లో దాదాపు ఒక కిల బరువు పెరుగుతాయి, ఈ విధంగా ఒక్కో కేజ్ నుండి 2-3 టన్నుల దిగుబడి సాధించవచ్చు.
Share your comments