Agripedia

నగరంలో అద్దెకు స్థలం తీసుకొని ఆర్గానిక్ సేద్యంతో 12 రకాల కూరగాయల సాగు చేస్తున్న మహిళలు!

KJ Staff
KJ Staff

వ్యవసాయంలో అధిక దిగుబడులే లక్ష్యంగా
ప్రమాదకర రసాయనాలను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మనం తినే ఆహారంతో పాటు నేల, నీరు,గాలి ప్రమాదకరం పురుగు మందుల అవశేషాలతో నిండిపోయింది ఇలాంటి ఆహారాన్ని నిత్యం తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.ఈ సమస్య నుంచి బయట పడడానికి చాలా మంది పట్టణ, గ్రామీణ వాసులు తమకున్న కొద్దిపాటి స్థలంలో లేదా మిద్దె తోటల పెంపకంలో ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను,పండ్లు, పువ్వులను సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తూఅర్బన్ కిసాన్ గా మారుతున్నారు.

ప్రస్తుత మార్కెట్లో సేంద్రియ పద్ధతుల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉండడంతో పట్టణ ప్రాంతానికి చెందిన సుధారాణి మరియు తులసి అనే మహిళలు వ్యవసాయం మీద ఆసక్తితో వినూత్నంగా ఆలోచించి అర్బన్ ఫార్మ్స్ సహకారంతో చిన్న స్థలం అద్దెకు తీసుకుని సేంద్రియ విధానంలో కూరగాయలను పండించడం మొదలు పెట్టి
నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయలు పెంచుతూ ఆదాయాన్ని సృష్ఘించుకున్నారు.

సుధారాణి నగరంలోని 600 గజాల భూమిని నెలకు 2400 రూపాయలకి అద్దెకు తీసుకొని అందులో మిరపకాయలు,వంకాయ,ఓక్రా, బీన్స్, టమోటాలు,దోసకాయ,పొట్లకాయ,డ్రమ్ స్టిక్ గుమ్మడికాయ, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర వంటి 12 రకాల కూరగాయలను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు. తనకు ప్రస్తుతం మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్ అంటూ విక్రయిస్తున్న ఉత్పత్తులపై నమ్మకం లేదని తానే స్వయంగా వాటిని సహజమైన ఎరువులను ఉపయోగిస్తూ పండిస్తున్నానని చెప్పారు.

అంతేకాదు త్వరలో పూర్తి స్థాయిలో ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెడతానని సుధారాణి.
తెలిపింది.ఈమె కొత్త తరహా వ్యవసాయానికి శ్రీకారం చుట్టి అందరిని ఆకర్షిస్తూ ప్రస్తుతం పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం అనేది ఎప్పటికీ వన్నె తరగని విద్య ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు. తక్కువ స్థలంలో ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించడం సులభమైన పద్ధతి కాబట్టి ఎవరైనా పండించుకోవచ్చు అని సుధారాణి చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine