Agripedia

తక్కువ పెట్టుబడితో వైట్ మస్లీ సాగు.. లక్షలో లాభాలు?

KJ Staff
KJ Staff

సాధారణంగా మనం పండించే పంటల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.అయితే ప్రస్తుతం రైతులు పాత వ్యవసాయ పద్ధతులను కాకుండా అభివృద్ధి చెందుతున్న ఆధునిక వ్యవసాయ పంటలను పండించడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది రైతులు ఎక్కువగా ఔషధగుణాలు ఉన్నటువంటి పంటలను సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ లోని రైతులు తక్కువ పెట్టుబడితో పంటలను సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతూ.. ఎంతోమంది రైతులకు ఆదర్శంగా ఉన్నారు.

గుజరాత్‌లోని... దాంగ్‌ జిల్లాలో రైతులు ఇప్పుడు ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఇక్కడ రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఈ గ్రామంలో రైతులు సుమారుగా 350 మంది రైతులు 40 ఎకరాల్లో వనమూలికలను సాగు చేస్తున్నారు. ఈ విధమైన వనమూలికలను వాడటం వల్ల ఇక్కడి ప్రజలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండటంతో ఈ వనమూలికల కు అధిక డిమాండ్ ఏర్పడింది.

ఈ గ్రామంలో పండించే వనమూలికనే తెలుపు మస్లీ. దీన్నే సఫేద్ మస్లీ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఈ మూలిక సాగు చేపడతారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను కలిగించే ఈ వనమూలికలను వాడటం వల్ల అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి, అంగస్తంభన సమస్యలు తొలగిపోవాలంటే, మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంచడానికి ఈ వనమూలికలు ఎంతగానో దోహదపడతాయి. ప్రస్తుతం ఈ వనమూలికలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడింది. వీటిని టానిక్ రూపంలో కూడా మనకు ఆన్ లైన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా మంచి గుర్తింపు ఉండటంతో మార్కెట్లో ఈ వనమూలికకు ఎంతో డిమాండ్ పెరిగింది.ఈ గ్రామంలోని జయేష్ భాయ్ మొకాసీ మొదటిసారి ఈ వనమూలికల పంటను సాగు చేశారు. ఈ క్రమంలోనే రైతు జయేష్ తక్కువ పెట్టుబడితో లక్షల్లో ఆదాయం పొందటంతో ఇతర రైతులు కూడా ఈ పంటను సాగు చేస్తూ అధిక ఆదాయాలను పొందుతూ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Share your comments

Subscribe Magazine