వ్యవసాయ జీవనాధారంగా ఉన్న రోజుల నుండి, వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా పరిగణించేలా కాలం మారింది. ఒకప్పుడు వ్యవసాయం చదుకోనివారికే అనుకునేవారు, అదే ఇప్పుడే ఉన్నత చదువులు చదివి, విదేశాలబాట పెట్టినవారు కూడా పొలంబాట పడుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలకు కూడా రాజీనామా చేసి వ్యవసాయం మొదలుపెట్టి, అపూర్వమైన విజయాలు సాధించిన ఎంతోమంది గురించి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం వ్యవసాయం ఒక వాణిజ్య పరిశ్రమగా రూపాంతరం చెందుతుంది. అయితే వ్యవసాయం చెయ్యాలనుకునే యువత సంప్రదాయ పంటలను కాకుండా కొత్త రకం పంటలు ట్రై చేస్తే లక్షల్లో ఆదాయం వచ్చిన ఆశ్చర్యపోనవసరంలేదు.
వరి పంట గురించి మనందరికి తెలుసు, వరి భారతీయులకు ప్రధానమైన ఆహరం. అయితే వరి లో సాధారణ రకాలతో పాటు ఎన్నో కొత్త రకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిలో నల్ల బియ్యం లేదా బ్లాక్ రైస్ కూడా ఒకటి. మార్కెట్లో బ్లాక్ రైస్ కు ఆధారణం అంతకంతకు పెరుగుతుంది. వ్యవసాయం మొదలుపెడతాం అనుకునేవారు, లేదా కొత్త రకాల పంటలు పండిద్దాం అనుకునేవారు, నల్ల బియ్యం సాగు చెయ్యడం లాభదాయకం. నల్ల బియ్యం సాగు
బ్లాక్ రైస్ ఎందుకంత ప్రత్యేకం?
అయితే మార్కెట్లో అధిక డిమాండ్ రావడానికి బ్లక్ రైస్ కి ఉన్న ప్రత్యేకతలలేమిటి అన్న సందేహం మీ అందరికి వచ్చే ఉంటుంది. సాధారణ బియ్యంతో పోలిస్తే బ్లాక్ రైస్ లో పోషకాలు అధికంగా ఉంటాయి, కాబట్టి వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. బ్లాక్ రైస్ ధర సాధారణ బియ్యం కంటే చాలా ఎక్కువ, అయితే వీటిలో ఔషధ గుణాల శాతం చాలా ఎక్కువ, బ్లాక్ రైస్ తినడం ద్వారా షుగర్ మరియు బీపీ కంట్రోల్ లో ఉంటాయి. చైనా లో పుట్టిన ఈ బ్లాక్ రైస్, దీనికున్న ప్రత్యేక ఔషధ గుణాల మూలంగా ప్రపంచం మొత్తం వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి. మన దేశంలో నల్ల బియ్యాన్ని ఎక్కువుగా ఈశాన్య రాష్ట్రాల్లో పండించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాలకు వీటి సాగు విస్తరిస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొందరు రైతులు వీటిని సాగు చేస్తున్నారు. అయితే బ్లాక్ రైస్ పండించే సమయంలో నల్ల రంగులో ఉన్నప్పటికీ కూడా పండిన తరువాత మాత్రం ఊదా లేదా నీలం రంగులోకి మారతాయి, అన్నం వండిన తరువాత వీటి రంగులో కాస్త వ్యత్యసం ఉంటుంది.
బ్లాక్ రైస్ సాగు పద్ధతి
సాధారణ వరి లాగానే బ్లాక్ రైస్ పంట కాలం కూడా దాదాపు నాలుగు నెలలపాటు ఉంటుంది. వరి నారు పోసినప్పటి నుండి పంట చేతికి రావడానికి 100-120 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో పంట ఎదుగుదలకు అవసరమైన పోషకాలతోపాటు, మొక్క ఎదగడానికి అనువైన వాతావరణం కూడా ఉండాలి. సాధారణ వరి మొక్కలకంటే నల్ల బియ్యం వరి మొక్కలు కొంచెం పొడవుగా ఉంటాయి, దీని వలన మొక్కలు పడిపోయే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. నల్ల బియ్యం వరి కంకులు కూడా పొడవుగా ఉండటం మూలాన దిగుబడి కూడా అధికంగానే ఉంటుంది. సాధారణ బియ్యం కేజీ 50-100 రూపాయిల ,మధ్య ఉంటే, నల్ల బియ్యం ధర 250-500 రూపాయిల వరకు పొందే అవకాశం.
నల్ల బియ్యం తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున ప్రజలు వీటిని తినేందుకు ఎక్కువుగా ఆశక్తి చూపిస్తున్నారు. నల్ల బియ్యం తినడం వలన గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించుకోవచ్చు. నల్ల బియ్యం తింటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. సాధారణ బియ్యంకంటే నల్ల బియ్యంలో ప్రోటీన్ శాతం ఎక్కువుగా ఉంటుంది. 100 గ్రాముల నల్ల బియ్యంలో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు మరియు బీపీ ఉన్నవారు కూడా నల్ల బియ్యం ఎటువంటి చింత లేకుండా తినవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున మార్కెట్లో వీటికి ఎంతో డిమాండ్ పెరిగింది, సేంద్రియ పద్దతిలో సాగు చేసిన నల్ల బియ్యానికి డిమాండ్ చాలా ఎక్కువుగా ఉంటుంది, కాబట్టి రైతులు వీటిని సాగు చెయ్యడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు.
Share your comments