Agripedia

ముల్లంగిలో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా?

KJ Staff
KJ Staff

అనేక ఔషధ గుణాలతోపాటు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ముల్లంగిని మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తినడానికి ఇష్టపడరు. ఆరోగ్య ప్రయోజనాల మీద అవగహన లేకపోవడం, మరియు తక్కువ సాగు విస్తీర్ణం కలిగి ఉండటం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.అయితే మన భారత దేశంలో ముల్లంగి ఆరోగ్య ప్రయోజనాలు గుర్తించిన కొన్ని రాష్ట్రాల ప్రజలు తమ రోజువారీ ఆహారంలో ముల్లంగిని తరచూ వాడుతూ ఉంటారు, ముఖ్యంగా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యాన, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ముల్లగిని పండించి, తింటారు. మన దేశంలోనే కాకుండా, పాశ్చ్యాతా దేశాల్లో కూడా ముల్లంగి వినియోగం మనం గమనించవచ్చు. ఇతర దేశాల్లో ముల్లంగిని సలాడ్స్ లో కలిపి తింటుంటారు.

క్రూసిఫెరేసి కుటుంబానికి చెందిన ముల్లంగి ఎంతో వైవిధ్యం కలిగి ఉంటుంది. ముల్లంగి అనేక రకాల ఆకారాల్లోనూ, రంగుల్లోనూ ఉంటడం గమనించవచ్చు. ఆవల మొక్కకు దగ్గర సంబంధం ఉన్న ముల్లంగి రుచిలో కుడా వైవిధ్యం కనబరుస్తుంది. ముల్లంగిలో ఉండే రకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్: పేరుకు తగ్గితే ఈ రకం ముల్లంగి ఎరుపు రంగు తోలుతో, మరియు తెల్లని గుజ్జు కలిగి ఉంటుంది. చూడటానికి ఒక ఉల్లిపాయ ఆకారాన్ని కలిగి ఉంటుంది. చెర్రీ బెల్లి, స్కార్లెట్ గ్లోబ్ అనే రకాలను ప్రధానంగా పండిస్తారు. వీటి రుచి అత్యంత ఘటుగా ఉంటుంది కనుక ప్రజలు వీటిని తినడానికి మొగ్గు చూపారు. యూరోప్ దేశాల్లో వీటిని ఎక్కువుగా వినియోగిస్తారు. భారత దేశంలో వీటి వినియోగం అంతగా కనబడదు.


డైకోన్: మనం మార్కెట్లో తరచు చూసే తెలుపు రంగు ముల్లంగి ఈ రకానికి చెందినదే. ఇండియాతో పాటు, చైనా, జపాన్ దేశాల్లో ఈ రకం ముల్లంగిని అధికంగా సాగుచేస్తారు. చైనా మరియు జపాన్ ప్రజలు ఈ రకం ముల్లంగితో ఎన్నో రకాల వంటకాలను తయారుచేస్తారు. డైకోన్ ముల్లంగి స్థూపాకారంలో, తెల్లని చర్మం మరియు గుజ్జును కలిగి ఉంటుంది. రెడ్ రకం ముల్లంగితో పోల్చుకుంటే డైకోన్ రకం తక్కువ కరంగా మరియు కొద్దీ పాటి తీపి రుచిని కలిగి ఉంటుంది.

వాటర్మేలన్: ఆకారంలో డైకోన్ రకం ముల్లంగిని పోలి ఉంది మరియు, గులాబీ రంగు గుజ్జు కలిగి ఉంటె వాటిని వాటర్మేలన్ ముల్లంగిగా గుర్తించవచ్చు. వీటి రుచి చాల ఘాటుగా ఉంటుంది కనుక పచ్చిగా తినడానికి ఇష్టపడరు, కొన్ని పద్దతుల ద్వారా వీటిని వండటం ద్వారా ఘాటు తగ్గి తినేందుకు వీలుగా ఉంటుంది.

బ్లాక్ రాడిష్: ఈ రకం ముల్లంగి గుండ్రంగా ఉల్లిపాయ ఆకారాన్ని కలిగి ఉంటుంది. పేరుకు తగ్గట్టే నల్లని పైపొర, మరియు తెల్లని గుజ్జు ద్వారా ఈ ముల్లంగిని గుర్తించవచ్చు. పైన చెప్పిన ముల్లంగి రకాలు అన్నిటికంటే ఈ రకం ముల్లంగి అధిక ఘాటును కలిగి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine