అడవిలో నివసిస్తున్న గిరిజన ప్రజలు ఉపాధి కొరకు అడవిలో దొరికే కొన్ని సహజ వనరులను సేకరించి అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తారు. అక్కడి ప్రజలు అడవిలో దొరికే వెదురు మరియు ఇతర కలపతో బుట్టలు మరియు వివిధ రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తారు. మరికొందరు ఐతే చెట్లకి ఉన్న తేనెపట్టు నుండి తేనెను సేకరించి అమ్ముకుంటూ ఉంటారు. కొంత మంది అడవిలో ఉపాధి కల్పించే చెట్లను గుర్తించి, వాటిపై ఆధారపడుతున్నారు. అలంటి వృక్షాలలో ఈ విప్పపువ్వు చెట్టు అనేది ఒకటి.
అడవిలో నివసించే గిరిజనులు ఈ విప్పపువ్వు చెట్ల మీద ఉపాధి పొందుతున్నారు. వీటితో ఇక్కడ ప్రజలకు దాదాపు 3 నెలల ఉపాధి లభిస్తుంది. ఈ విప్పపువ్వులు ఖరీఫ్, రబి సీసన్ చివరికి విచ్చుకుంటాయి. ఆ సమయంలో అక్కడ గిరిజనులు తెళ్ళవారుజామునే లేచి అడవికి వెళ్లి ఆ విప్పపువ్వులను సేకరిస్తారు. అల సేకరించిన ఈ పువ్వులను మధ్యాహ్నం ఇంటి దగ్గర ఎండబెడతారు. ఈ విప్పపువ్వులను మార్చి నుండి మే సమయంలో జిసీసీల ద్వారా విక్రయిస్తారు.
ఈ విప్పపువ్వు ముఖ్యంగా మనకి వైద్యశాస్త్రంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ ఎండిన విప్పపువ్వుల నుండి పంచదారను తయారు చేసి కేక్, జామ్ తయారీలో వాడే విధానాన్ని 1999ల నిర్వహించిన పరిశోధనలో కనిపెట్టారు. దానితో పాటు ఈ విప్పపుప్కువాలా గింజల నుండి నూనెను కూడా తీయవచ్చు. ఈ విప్పపువ్వు నూనెలో ఎన్నో పోషక విలువలు ఉన్నట్లు సాత్రియంగా నిరూపించారు.
ఇది కూడా చదవండి..
కొబ్బరి మరియు పామాయిల్ పంటలో అంతర్ పంటగా 'కోకో'!
ఈ విప్పపువ్వులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది మనకు అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఔషధ తయారీలో కూడా ఈ విప్పపువ్వులను వాడతారు. ఎవరికైనా పక్షవాతం వస్తే ఈ విప్పపువ్వు నుండి సేకరించిన తైలాన్ని వాడితే తగ్గుతుందని గిరిజన ప్రజలు అంటున్నారు. దానితో పాటు ఈ విప్పపువ్వు దంతాలు మరియు దగ్గు వంటి సంశయాలకు ఔషధంగా పనిచేస్తుంది.
దాదాపుగా 20 వేలకు పైగా విప్ప చెట్లు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్పచెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు. ఇక్కడ ఉన్న విప్పపువ్వులను కేవలం బీసీసీ అధికారులే కాకుండా అనేక మంది వ్యాపారులు కూడా ఈ గిరిజనుల దగ్గరికి వచ్చి కొనుగోలు చేకుంటారు. ఈవిధంగా ఇక్కడి గిరిజనులు విప్పపువ్వు చెట్ల నుండి ఉపాధి పొందుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments