Agripedia

వివిధ పంటలను ఆశించే పొగాకు గొంగలి పురుగు లక్షణాలు-నివారణ చర్యలు!

KJ Staff
KJ Staff

పంట దిగుబడి అధికంగా రావడంతో పాటు రైతులకు సాగు మంచి లాభదాయకంగా ఉండాలంటే పంట సస్యరక్షణ చర్యలు చాలా ముఖ్యం. పంటలను అనేక రకాల కీటకాలు, చీడపీడలు ఆశిస్తుంటాయి. కొన్ని తీవ్రమైన పంట నష్టాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో పొగాకు గొంగలి పురుగు ఒకటి. ఈ పురుగులు చూడ్డానికి గోధుమ రంగు శరీరంపై తెల్లని చారలతో ఉంటాయి. రేక్కలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఈ జీవులు మొక్కల ఆకుల అంచులు కింది భాగం, పై భాగాల్లో ఒక్కోటి వందలాది గుడ్లను పెడతాయి. పొదగబడిన తర్వాత లేత ఆకుపచ్చరంగులో లార్వా దశ జీవులు ఏర్పడతాయి. లార్వదశలోని జీవులు ఆకులను నిరంతరాయంగా తినేస్తుంటాయి. ఎక్కువగా రాత్రి సమయాల్లో ఇవి పంటపై దాడికి పాల్పడుతూ.. మొక్కల ఆకులన్నీంటిని తినేస్తుంటాయి. పగటి సమయాల్లో పంట పొలం నేలలో దాక్కుంటాయి.

లార్వదశలోని ఈ పురుగులు పంట మొక్కల ఆకులను వివరీతంగా తినడం వల్ల పంటపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇవి మరీ అధికంగా ఉంటే తొటలో మొక్కలకు ఆకులు లేకుండా తినేయడంతో కేవలం కొమ్మలు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంటుంది. కాత సమయంలో ఇవి వ్యాపిస్తే.. ఆకులతో పాటు కాయలను కూడా తినేస్తాయి. మొక్కల ఆకుల కణజాలాన్ని తినేస్తాయి కాబట్టి ఆకులు మొక్కల నుంచి పూర్తిగా రాలిపోతాయి. రాత్రి సమయంలో నేలలో దాక్కునే సమయంలో మొక్కల వేర్లపై కూడా ఈ జీవులు దాడి చేస్తాయి. లార్వలు ఎదిగిన పురుగులుగా మారీ గుండల్లను పెడతాయి. సస్యరక్షణ చర్యలు తీసుకోకుంటే వీటి సంతతి మరింత పెరిటి పంట మొత్తం నష్ట జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పంటలో వీటిని గుర్తించిన వెంటనే సస్య రక్షణ చర్యలను వేగవంతం చేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

పొగాకు పురుగు లార్వాలు, గుడ్లను ఆహారంగా తీసుకునే అనేక రకాల కందీరగ జాతులకు చెందిన జీవులు ఉన్నాయి. కాబట్టి స్థానిక వ్యవసాయ కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి వాటని పంటపొలంలో విడిచిపెట్టాలి. దీంతో పొగాలకు గొంగలి పురుగుల ప్రభావం పంటపై లేకుండా ఉంటుంది. సేంద్రీయంగా తయారుచేసే వేప నూనే, కషాయంలను సైతం పంటపై పిచుకారీ చేసుకుంటే వీటి ప్రభావం తగ్గుతుంది. సాయంత్రం వేళల్లో నేలపై సంబంధిత రసాయనాలను చల్లుకోవాలి. గొంగలి పురుగుల నివారణకు ప్రస్తుతం మార్కెట్ లో అనేక రసాయన మందులు సైతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు పంటల రకాలు, వ్యవసాయ నిపుణులు సలహాల ఆధారంగా పిచుకారీ చేసుకోవాలి. ప్రస్తుతం అనేక రకాల తెగుళ్లను, పురుగులు ఆశించని విత్తన రకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అలాంటి రకాలను ఎన్నుకోవడం ఉత్తమం.

Share your comments

Subscribe Magazine