తెలుగు రాష్ట్రాల్లో నిమ్మపంటను అధికంగానే సాగు చేస్తారు. వేసవికాలం వచ్చిందంటే చాలు నిమ్మకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. అలాంటి ఈ నిమ్మచెట్లకు దిగుబడి ఎలా పెంచాలో తెలుసుకుందాం. దక్షిణ భారత దేశంలో సాగయ్యే నిమ్మ తోటల్లో సంవత్సరంలో రెండు శాతం మాత్రమే సహజ సిద్దంగా పూత ఏర్పడుతుంది. దానితోపాటు నిమ్మతోటల్లో పూత నియంత్రణ యాజమాన్యం కూడా చూద్దాం.
సాధారణంగా నిమ్మచెట్లకు జనవరి నెలల్లో వచ్చే పూత, 3నెలల కాలంలో కాయలుగా మారతాయి. మాటే మనకి ఏప్రిల్ లేదా మే సమయంలో దిగుబడి వస్తుంది. రెండవ దఫాగా జూన్ – జులైలో పూతకు వచ్చిపంట అక్టోబర్ లో దిగుబడి వస్తుంది. నిమ్మ పంటలను సాగు చేస్తున్న రైతులు పంటకు ఎప్పుడు పడితే అప్పుడు నీరు పెట్టడం వలన పూత సరిగ్గా కాయడం లేదు. వేసవికాలంలో కాయ దిగుబడిని పెంచడానికి నవంబరులో చెట్లను వాడుకు తీసుకురావాలి.
నిమ్మచెట్లు పూత దశకు రావాలంటే వాటి కోణాల్లో పిండిపదార్థాలు ఎక్కువగా మరియు నత్రజని మోతాదు తక్కువగా ఉండాలి. నిమ్మచెట్ల కొమ్మల్లో పిండిపదార్థాల నిల్వ శాతం పెరిగిన తరువాత 10-15 రోజులకు ఒకే సారి నీటిని మరియు పోషకాలను అందిచడం ద్వారా నిమ్మ చెట్లను చిగురింపచేయవచ్చు. చెట్లను వాడుకు తీసుకువచ్చే విధానాన్ని ”బహార్ పద్ధతి” అని అంటారు.
ఇది కూడా చదవండి..
రైతులకు పంట దిగుబడిని పెంచడం కోసం 'కిసాన్ జిపిటీ'..
నాణ్యమైన నిమ్మ దిగుబడులను పొందడానికి జూన్‌లో 50 పి.పి.యం జిబ్బరెల్లిక్ ఆమ్లాన్ని , సెప్టెంబరులో 1000 పి.పి.యం సైకోసెల్ ద్రావణాన్ని ,అక్టోబరులో పొటాషియం నైట్రేట్ 10 గ్రా. లీటరు నీటికి కలిపి చెట్లపై పిచికారి చేయాలి. పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 500 గ్రా. యూరియా, 400 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్లకు వేయాలి. పూత అనేది ఎరువులు వేసిన 15 రోహులకు వస్తుంది.
హార్మోన్ల లోపాన్ని నివారించేందుకు ప్లానోఫిక్స్ 2.5 మి.లీ. 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. చెట్లకు మంగు ఆశించకుండా ప్రొపార్‌గైట్ 2 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయల్లో రసం శాతం పెంచడానికి పొటాషియం నైట్రేట్ 10 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయ రంగు మారడాన్ని నివారించేందుకు యూరియా 10 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఇది కూడా చదవండి..
Share your comments