ప్రతియేటా దేశంలో ఎలుకల వలన రైతులు భారీ మొత్తంలో పంటను నష్టపోతున్నారు. ఎలుకలు నష్ట పరిచే పంట విలువ సైతం అధికంగా ఉంటోంది. అయితే, వ్యవసాయదారులు తమ పంటపొలాలను, పంటను ఎలుకల నుంచి కాపాడుకునే కొన్ని రకాల చిట్కాలు, విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి జీవి సాధారణంగా కొరుకునే విషయాలు ఆశ్రయం, ఆహారం, నీరు వంటివి ఉంటాయి. ఎలుకలు కూడా ఇదే విషయాల నేపథ్యంలో పంట పొలాల్లోకి చేరుతాయి. ఎందుకంటే అక్కడ వాటికి సరిపడంతా నీరు, పంట నుంచి ఆహారం, అక్కడి పొలాల్లో బొరియలు చేసుకుని ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. సరైన సమయంలో రైతుల జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పత్తితో వాటి సంఖ్యను పెంచుకునీ, రైతులకు మరింత తీవ్ర నష్టాన్ని ఎలుకలు కలిగిస్తాయి.
ప్రధానంగా ఎలుకలు పంటపొలం గట్ల వెంబడి ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఉంటాయి. అలాగే, వ్యవసాయ పొలాల్లో మైదానం, పుట్టలు ఉన్న ప్రాంతాల్లోనూ ఎలుకలు నివాసముంటాయి. వ్యవసాయ పొలంలో ఎక్కడైన బొరియలు, చిన్న చిన్న గొయ్యిలు కనిపిస్తే అక్కడ ఎలుకలు ఉన్నట్టు గుర్తించాలి. అలాంటప్పుడు వాటిల్లోకి పొగపెట్టి దూరం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలుకలు బొరియల లోపలే చనిపోతాయి. లేదా అలాంటి వాటిలో విషపు బిళ్లలు లేదా ఇతర ఎలుకల నివారణకు ఉపయోగించే మందులు పెట్టి వాటిని దూరం చేయవచ్చు.
ఎలుకలు తవ్విన గొయ్యిలో వాసన రాని ఎలుకల నివారణ మందులను ఇతర ఆహార పదర్థాలతో కలిపి పెట్టాలి. దీంతో వాటిని తిని ఎలుకలు చనిపోతాయి. బొరియల్లో ఉన్న ఎలుకలను చంపడానికి పలుగు, పారలను కూడా ఉపయోగించి పంట పొలంలో ఎలుకల నివారణ చేయవచ్చు. ఎలుకలను పంటపొలం నుంచి దూరం చేస్తే మార్గాల్లో మరో ఉత్తమమైన మార్గాల్లో ఉచ్చులు వేయడం ఒకటి. అయితే, చనిపోయిన ఎలుకలను గోతుల్లో పూడ్చకుంటే పంట పొలంలో దుర్వాసనతో పాటు ఇతర కీటకాలను సైతం ఆకర్షించే అవకాశం ఉంది. దీంతో పంటకు నష్టం జరగవచ్చు. ఈ విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఎలుకలను భయపెట్టే వాటిల్లో పిల్లులు, కుక్కలు, ప్రిడేటర్ మూత్రం ఒకటి. వీటిని పంట పొలాల గట్లల్లో చల్లడం వల్ల కూడా ఎలుకలను నివారించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో ఇవి లభిస్తున్నాయి. ఎలుకలను పంట పొలానికి దూరంగా ఉంచే చర్యలో అత్యంత తేలికైన మెళకువల్లో కంపోస్టు పిట్ పిచికారీ చేయడం ఒకటి. ఎలుకలు పంట పొలంలో కనిపిస్తే కంపోస్టు పిట్ ను పిచికారీ చేస్తే ఎలుకలు రాకుండా ఉంటాయి. ఉన్నవి కూడా అటునుంచి పారిపోతాయి.
Share your comments