రాబోయే ఐదు రోజులలో ఉరుములతో కూడిన వర్షపాత సూచనలు ఉన్నాయి కాబట్టి రైతులు తగిన విధంగా ఏయే పనులు చేపట్టాలో ఇప్పుడు చర్చిద్దాం.
భారత వాతావరణ శాఖ, వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక జారీ చేసింది.కాబట్టి రైతన్నలు పంట కోత తర్వాత నష్టాలను నివారించడానికి ఇప్పటికే పండించిన పంట ఉత్పత్తులను (టార్పాలిన్) పాలిథిన్ కవర్ తో కప్పండి.
ప్రస్తుతానికి పంట ఉత్పత్తులను మార్కెట్‌లకు రవాణా చేయడాన్ని వాయిదా వేయండి.
వచ్చే వర్షాలను సద్వినియోగం చేసుకొని రైతులు వేసవి దుక్కులు దున్నుకొని వ్యవసాయ క్షేత్రం లో కలుపు మొక్కలు,పంటలకు హానీ చేసే పురుగులను మరియు వర్షాకాల పంటలను (ఖరీఫ్) దెబ్బతీసే వ్యాధి కారక బీజాంశాలను నివారించవచ్చు.
కొత్తగా పండ్ల తోటలు పెంచాలి అనుకునేవారు ఇప్పుడే వ్యవసాయ క్షేత్రం లో గుంతలు తవ్వడం ఉత్తమం.
వివిధ పంటలలో తీసుకోవాల్సిన సమగ్ర సస్య రక్షణలు:
కూరగాయలు:
కూరగాయల్లో రసం పీల్చే పురుగుల తాకిడి ఉన్నట్లయితే. వీటి నివారణకు ఒక లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయండి.
ప్రస్తుత ఉన్న వాతావరణ పరిస్థితుల వళ్ల కూరగాయల పంటలలో ఆకు మచ్చల తెగులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి దీని నియంత్రణకై ఒక లీటరు నీటికి కార్బెండజిమ్ 1 గ్రా లేదా ప్రొపికోనజోల్ 1 మి.లీ కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
వంకాయలో ముఖ్యంగా పండు తొలుచు పురుగు తాకిడి వలన నష్ట తీవ్రంగా ఉంటుంది. వీటిని అధిరోహించడానికి వ్యవసాయ క్షేత్రం లో
ఫెరోమోన్ ట్రాప్‌లను ఏర్పాటు చేయడం ఉత్తమం.
తెగులు సోకిన రెమ్మలను వేరు చేసి నాశనం చేయండి. అంతే కాకుండా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4గ్రా
ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మిరప పంటలో తామర పురుగు తాకిడి అధికంగా ఉంటుంది . నియంత్రణకు, ఫిప్రోనిల్ @ 2 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మామిడి
ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో పండు ఈగ ఆశించే అవకాశాలు విపరీతంగా ఉంటాయి.వీటిని ట్రాప్ చేయడానికి
మిథైల్ యూజినాల్ @ 2 ml మరియు కార్బోఫ్యూరాన్ 3G గుళికల మిశ్రమాన్ని ప్లాస్టిక్ కంటైనర్‌లలో వేలాడదీయండి
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మామిడిలో పొలుసు పురుగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని నివారణకై
నివారణకు ఒక లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ @ 0.3 మి.లీ + వేపనూనె @ 2.5 మి.లీ కలిపి పిచికారీ చేయాలి.
పౌల్ట్రీ (కోళ్ల పెంపకం)
పౌల్ట్రీలో రాణిఖెత్ వ్యాధి రావడానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి.వ్యాధులను నివారించడానికి, కోళ్ళకి టీకాలు వేయండి.
షెడ్లలో ఫ్యాన్లు మరియు ఫాగర్లు ఏర్పాటు చేయడం ద్వారా కోళ్ళను రక్షించండి, షెడ్ల పై భాగాన్ని వరి లేదా ఇతర గడ్డి తో కప్పండి.చల్లదనాన్ని అందించడానికి పై భాగంలో స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
పశు సంపద (లైవ్ స్టాక్)
పశువులలో హెమరేజిక్ సెప్టిసిమియా మరియు నోటి వ్యాధి నిరోధించడానికి జంతువులకు టీకాలు వేయండి.
మరిన్ని చదవండి.
Share your comments