సిద్ధిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు భారీగా పెరిగింది. దీనికి అంతర్జాతీయంగా ఆయిల్ పామ్ కు డిమాండ్ పెరగడం అని చెప్పుకోవచ్చు. దీనివలన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఈ పంటను సాగు చేయడానికి సబ్సిడీలను అందించి ప్రోస్తాహిస్తుంది. ఈ ఆయిల్ పామ్ ను సాగు చేయడం వలన రైతులకు కూడా మంచిగా లాభాలు వస్తున్నందున, సిద్ధిపేట జిల్లా రైతులు కూడా ఈ పంటను సాగు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తర్వాత సిద్ధిపేటలో అత్యధికంగా ఆయిల్ పామ్ పంటను పండిస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఆయిల్ పామ్ సాగును చేస్తారు. ప్రస్తుతం ఈ రెండు జిల్లాల తరువాత సిద్ధిపేట జిల్లా ఉండటం విశేషం. ఈ ఆయిల్ పామ్ సాగు గురించి తెలంగాణకు చెందిన వ్యవసాయశాఖ మరియు ఉద్యాన అధికారులు కలిసి రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ వంటి జలాశయాలను నిర్మించడం వలన భూగర్భజలాలు పెరిగి, సాగు నీటి కొరత లేకుండా ఉంది. దీనితో జిల్లాలో రైతులు కూడా ఈ ఆయిల్ పామ్ సాగును చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాల్లో సిద్ధిపేట జిల్లా అంతటా 7 వేల ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ సాగు జరిగింది. ఈ సంవత్సరం 2800 ఎకరాల్లో మరియు గత సంవత్సరం 4200 ఎకరాల్లో సాగు జరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించింది. దీనితో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. వచ్చిన ఆయిల్‌పామ్ దిగుబడిని ప్రాసెస్సింగ్ చేసేందుకు సిద్ధిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
పామాయిల్ సాగులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఏలూరు జిల్లా నిలిచింది...
వేరే పంటలతో పోల్చుకుంటే ఈ ఆయిల్ పామ్ సాగుకు దిగుబడి మరి లాభాలు కూడా ఎక్కువ. ఆయిల్ పామ్ పంట నూనె దిగుబడి 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటాది. ఈ ఆయిల్ పామ్ పంటకు ఎక్కువగా చీడపురుగులు, తెగుళ్లు ఆశించవు. కాబట్టి వీటివల్ల కలిగే నష్టం తక్కువ. పైగా ఈ పంట నిర్వాహణకు కూలీలా అవసరం కూడా అంతగా ఉండదు.
మొక్కలు నాటిన 4వ సంవత్సరం నుండి దిగుబడి అనేది వస్తుంది, అప్పటి నుండి 30 సంవత్సరాల వరకు నిరంతర దిగుబడి వస్తుంది. ఈ ఆయిల్ పామ్ పంటను సాగు చేయడం ద్వారా ఖర్చులు పోను ఎకరానికి రూ.1,00,000 వరకు ఆదాయాన్ని పొందచ్చు. ఈ ఆయిల్ పామ్ తో పాటు అంతర్ పంటగా అరటి, బొప్పాయి వంటి వివిధ రకాల పంటలను వేసుకుని అధిక లాభాన్ని పొందచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments