రాష్ట్ర వ్యాప్తముగా అటు మిరప ఇటు పసుపు అనే తేడా లేకుండా తెగుళ్లు పంటలపై తీవ్రముగా దాడి చేస్తున్నాయి .. రైతు కష్టపడి అప్పు చేసిమరీ సాగు చేస్తుంటే తెగుళ్ల ప్రభావం తో పెట్టిన పెట్టుబడి కూడా పొందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు . పసుపు పంట ను ఆశించే ప్రధాన తెగుళ్లు అయిన దుంప తెగులు మర్రాకు పంటను నాశనం చేస్తున్నాయి .
పెరిగిన ఎరువుల ,కూలీల ఖర్చుతో ఒక ఎకరం పసుపు సాగు చేయడానికి రైతుకు 1. 25 లక్షల ఖర్చు వస్తుంది అని రైతులు తెలిపారు. అయితే తెగుళ్లు కారణముగా 25 శాతం మాత్రమే దిగుబడి పొందగల్గుతున్నామని ,ఒకేసారి రెండు రకాల తెగుళ్లు పంటను పీల్చి పిప్పి చేస్తుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని నిజామా బాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 63 వేల ఎక రాల్లో పసుపు పంట సాగు జరిగింది . దుంపకుళ్లు కారణంగా పసుపు మొక్క కింది భాగాన కొమ్ము పిలకలు మురిగిపోయాయి. దాదాపు 60 శాతం పంటకు దుంపకుళ్లు సోకినట్లు రైతులు తెలిపారు . దిగుబడి తక్కువగా వస్తుండడంతో ప్రభుత్వం సరైన మద్దతు ధర కల్పించి , అదేవిధముగా పంటకు తగు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని విన్నపిస్తున్నారు .
మిర్చి పంటను వీడని తెగుళ్లు .. రైతులకు లక్షల్లో నష్టాలు .. పరిష్కార మార్గం ఏది ?
శాస్త్రవేత్తలు ఎం సూచిస్తున్నారు ?
సస్యరక్షణ చర్యలలో భాగంగా తెగుళ్ల నివారణ రైతులు సకాలంలో చర్యలు తీసుకుంటే దుంపకుళ్లు, మర్రాకు తెగుళ్లను నివారించవచ్చు. లీటర్ నీటికి ఒక గ్రాము మెటలాక్సిల్ ప్లస్ మాంకోజెట్ లేదా 2 గ్రాముల కాప్టాస్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ను కలిపి తెగులు సోకిన మొక్కలు, వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి. తెగులు ఉద్ధృతి ఎక్కువగా
ఉంటే ఎకరానికి 10 కిలోల ఫారెట్ 10 జి గుళికలు, ఒక కిలో సైమాక్సోనిల్ ప్లస్ మాంకోజెట్ పొడి, తగినంత యూరియా కలిపి పంట మొత్తం చల్లాలి. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు అవసరమైన మందులు వినియోగించాలి. అని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు .
Share your comments