తెలంగాణ ప్రభుత్వం వరికి ప్రత్యమ్న్యాయం గ ప్రత్తి సాగును ప్రోత్సహించాలని భావిస్తుంది దానిలో భాగంగానే యాసంగిలో వివిధ విత్తన కేంద్రానికి సంబందించిన భూమిలో దాదాపు 200 ఎకరాలలో ప్రత్తి సాగు చేయాలనీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది .విత్తన కేంద్రాలలో సాగు ఫలిస్తే రైతులకు డెమో చూపించి యాసంగిలోను ప్రతిని సాగును ప్రోత్సహించనుంది .
వ్యవసాయ క్షేత్రలో సాగుచేసి వాటిని రైతులకు డెమోగా ప్రదర్శించి వాటి దిగుబడులను పరిశీలిస్తారు . యాసంగి రైతులకు వచ్చిన ఫలితాలను బట్టి పత్తి సాగునీ ప్రోత్సహిస్తారు .
యాసంగిలో కొందరు రైతులు పత్తి సాగుచేసి ఎకరానికి 10 క్వింటాళ్లు దిగుబడి సాధిస్తున్నారు. దీనితో వ్యవసాయ మంత్రి మంత్రి నిరంజన్ రెడ్డి మిగతా ప్రాంతాల్లో కూడా పత్తి సాగుచేయించేలా ఉన్నత అధికారులను సూచించారు . దీనికొరకు పత్తి సాగుపై చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లతో జరిపిన మీటింగ్ లో సూచించారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సలహాలను పాటించి విత్తన క్షేత్రాల్లో పత్తి సాగు ప్రారంభించనున్నారు . యాసంగిలో విత్తన క్షేత్రాల వద్ద సాగునీటి లభ్యత మరియు వాతావరణ పరిస్థితులు , నేల స్వభావం వంటి అంశాలను పరిశీలించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు పరిశీలన చేయనున్నారు. ప్రభుత్వానికి సంబంధిచి రాష్ట్రంలో మొత్తం 10 విత్తన క్షేత్రాలు ఉండగా కొన్నిటిలో పత్తి సాగుకొరకు ఏర్పాట్లు చేశారు . 200 ఎకరాల్లో పత్తి సాగును విజయవంతం చేసి , అక్కడి సాగు పరిస్థితులపై మరియు దిగుబడిపై పరిశీలన చేయనున్నారు.
Perennial Rice23 :ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా
కామారెడ్డి జిల్లాకు సంబందించిన బొప్పాస్పల్లి గ్రామంలో 60 ఎకరాలు , మాల్తుమ్మెద విత్తన క్షేత్రములో 50 ఎకరాలు , నాగర్కర్నూల్ జిల్లాలో దిండి విత్తన క్షేత్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో 90 ఎకరాల్లో సాగు చేయనున్నారు. యాసంగిలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తే మంచి ఫలితాలు వచ్చినట్టే అని చెబుతున్నారు.
Share your comments